Budget Rule: రూ.25 వేల జీతంతో అప్పు లేకుండా బతకొచ్చా? సీఏ చెప్పిన 60-30-10 ఫార్ములా ఇదే |
నెలవారీ జీతాన్ని సమర్థంగా నిర్వహించడానికి సులభమైన పద్ధతుల్లో 60-30-10 బడ్జెట్ నియమం ఒకటి. ఇందులో ఆదాయాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అవసరమైన ఖర్చులు, జీవనశైలి ఖర్చులు, పొదుపు లేదా పెట్టుబడులు. నెలకు రూ.25,000 సంపాదించే వ్యక్తి ఈ విధానాన్ని పాటిస్తే రూ.15,000 అవసరమైన ఖర్చులకు, రూ.7,500 వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఖర్చులకు, రూ.2,500 పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించవచ్చు. నెల ఆదాయంలో దాదాపు రూ.15,000 తప్పనిసరి ఖర్చుల కోసం కేటాయించాలి. ఇందులో ఇంటి అద్దె, కిరాణా సరుకులు,…
