క్లెయిమ్ ఆలస్యం కావడానికి ముఖ్యమైన కారణాల్లో సరైన కేవైసీ లేకపోవడం కూడా ఒకటి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ మీ యూఏఎన్‌కు లింక్ అయి ఉండాలి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వివరాల్లో చిన్న తప్పు ఉన్నా సమస్యలు ఎదురవుతాయి. మరో కారణం బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా ఉండటం. మీ ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా మూసివేసి ఉంటే లేదా మార్చి ఉంటే, కొత్త వివరాలను అప్డేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)

