భారతదేశం తన ఇంధన సరఫరా మార్గాలను విస్తరించుకునే అవకాశాలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఉన్న విస్తృత చమురు శుద్ధి సామర్థ్యాలను ఆయన ప్రశంసించారు. వెనిజులాలో చమురు ఉత్పత్తి పెరిగితే భారత్‌కు కొత్త అవకాశాలు ఏర్పడవచ్చని, ముడి చమురును శుద్ధి చేయడంలో భారత కంపెనీలకు ఉన్న నైపుణ్యం దీనికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే అమెరికాలో రిలయన్స్ సంస్థ చమురు శుద్ధి రంగంలో చేసిన పెట్టుబడులను కూడా రూబియో ప్రస్తావించారు. భారత్–అమెరికా ఇంధన రంగ సహకారం, వెనిజులా చమురు ఉత్పత్తి పెరుగుదలతో భారత్‌కు కలిగే అవకాశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
