Heavy Rain Lashes Mumbai : ముంబైని ముంచెత్తిన భారీ వర్షం!
భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా సౌత్ ముంబై పరిధిలో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (Airport) వీఐపీ గేట్ నంబర్ 3 వెలుపల భారీగా వరద నీరు చేరడంతో మోకాళ్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ఎయిర్పోర్ట్కు వచ్చే పలు వాహనాలు వరద నీటిలోనే ఆగిపోయాయి. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Source link
