Last Updated:
చక్కెర ధరలు పెరిగడానికి ఇథనాల్ ఉత్పత్తికి చక్కెర మళ్లింపు కారణం కాదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాగే ధరల్ని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించింది.
ఇటీవలి వారాల్లో చక్కెర ధరలు పెరిగాయి. 2026 జూలై 20న కిలో చక్కెర ధర రూ.48.18 ఉండగా, 2026 ఆగస్టు 20న రూ.55.70కు పెరిగింది. వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా, ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, అనేక చర్యలు తీసుకుంది. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణమని చెప్పడం తప్పు అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిజానికి, ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12% ఉండగా, 2025-26లో సుమారు 9%కి తగ్గింది. అంతేకాకుండా, ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు మూడు వంతులు ధాన్యాల నుంచి, ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తోందని వివరించింది.

