గతంలో అర్జున్ రాంపాల్‌కు సూపర్ మోడల్ మెహర్ జెసియా (Supermodel Mehr Jesia)తో వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2018లో వీరు విడిపోగా, 2019లో విడాకులు ఖరారయ్యాయి. మెహర్, అర్జున్లకు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన కుమార్తెలు గ్యాబ్రియెల్లాను స్వీకరించడం, ఆమెతో బాండింగ్ ఏర్పరచుకోవడం తన లైఫ్‌లో చాలా ముఖ్యమైన విషయమని అర్జున్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
