PM Modi: కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోదీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై కీలక చర్చ |
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల కుదిరిన అవగాహనను స్వాగతిస్తూ, అన్ని వివాదాస్పద అంశాలకు సంభాషణ, దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని భారత్ ఎప్పటినుంచో చెబుతున్న విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం నెలకొనేందుకు అన్ని దేశాలు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సముద్ర…
