Last Updated:
Apple కొత్త iPhone కోసం ఎదురుచూస్తున్నారా? అయితే iPhone 18 Proపై వచ్చిన తాజా లీకులు ఆసక్తి రేపుతున్నాయి. Apple అధికారిక ప్రకటనకు ముందే పూర్తి వివరాలు తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 18 Proపై వరుస లీకులు, పరిశ్రమ వర్గాల అంచనాలు వెలువడుతున్నాయి. Apple అధికారికంగా ఇంకా కొత్త iPhone లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించకపోయినా, వచ్చే నెలలో జరిగే వార్షిక సెప్టెంబర్ ఈవెంట్‌లో iPhone 18 Proను పరిచయం చేసే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈసారి iPhone 18 Proతో పాటు iPhone 18 Pro Max, కొత్త iPhone Ultra కూడా రావచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే సాధారణ iPhone 18 మాత్రం తర్వాతి తేదీలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

