ప్రభన్యూస్

ఏఐ నుంచి ఎనర్జీ సైన్సెస్ వరకు… ఏట్రియా యూనివర్సిటీలో 270 సీట్లు, స్కాలర్‌షిప్స్! | బిజినెస్


నాలుగు ప్రధాన విభాగాల్లో కోర్సులు

ఏట్రియా యూనివర్సిటీలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, లైఫ్ సైన్సెస్, ఎనర్జీ సైన్సెస్, ఈ-మొబిలిటీ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి కోర్ ఏఐ అండ్ ఫౌండేషన్ మోడల్స్, ఏఐ స్టీవార్డ్ (బాధ్యతాయుతమైన ఏఐ), సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్‌చెయిన్, హెల్త్‌కేర్‌లో ఏఐ వినియోగం, 3డీ బయోప్రింటింగ్ వంటి కొత్త స్పెషలైజేషన్లను ప్రవేశపెడుతున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ ఒకే విధమైన ప్రాథమిక విద్య అందిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, ఎనర్జీ, మొబిలిటీ అంశాలపై మూడు వారాల చొప్పున ప్రత్యేక సెషన్లు ఉంటాయి. దీని వల్ల వివిధ రంగాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్న తర్వాత తమకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకోవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ రంగాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగుల అవసరం గణనీయంగా పెరగనుంది. వచ్చే రెండు నుంచి మూడేళ్లలో ఈ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. బెయిన్ అండ్ కంపెనీ అంచనాల ప్రకారం.. భారత్‌లో ఏఐ ఉద్యోగ ఖాళీలు 2027 నాటికి 23 లక్షలు దాటనున్నాయి. అందుబాటులో ఉన్న ఏఐ నిపుణుల సంఖ్య ఈ డిమాండ్‌లో సగం మాత్రమే ఉండొచ్చని అంచనా. అడెక్కో ఇండియా ప్రకారం.. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఏటా 15-20 శాతం పెరగనున్నాయి. సీఈఈడబ్ల్యూ-ఎన్‌ఆర్‌డీసీ అంచనాల ప్రకారం.. 2030 నాటికి క్లీన్ ఎనర్జీ రంగంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు ఏర్పడవచ్చు. బయోఎకానమీ రంగం విలువ కూడా 2030 నాటికి దాదాపు రెట్టింపై 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

Atria University admissions 2027-28, best STEM universities in India, AI courses after 12th, merit scholarships for students 2027, undergraduate admission in Bangalore, career opportunities in artificial intelligence, ఇంటర్ తర్వాత కెరీర్ అవకాశాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్ వివరాలు, బెంగళూరులో ఉన్నత చదువులు, ఏఐ కోర్సులతో ఉద్యోగ అవకాశాలు, ఏఐ కోర్సులు

డాక్టర్ రాజీవన్ మాధవన్ నాయర్ (వైస్ ఛాన్సలర్, అట్రియా యూనివర్సిటీ) & శ్రీ శశికమార్ ఎన్ (హెడ్ ఆఫ్ అవుట్‌రీచ్, అట్రియా యూనివర్సిటీ)

తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులు

హైదరాబాద్‌లో ఏఐ, లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాలకు సంబంధించిన కోర్సులు ఏట్రియా యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. 2026 ఆగస్టులో హైదరాబాద్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్) ఉద్యోగ నియామకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 48 శాతం పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 ద్వారా 2030 నాటికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 84 మంది విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో ఏట్రియా యూనివర్సిటీలో చేరారు.

విద్యార్థులకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలపై పనిచేసే అవకాశం కల్పించేందుకు ఏట్రియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు. వీటిలో సింథటిక్ బయాలజీ ఏఐ (SynBioAI), ఏజెంటిక్ క్యాంపస్ మైక్రోగ్రిడ్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ, సన్ మొబిలిటీ, ముసాషి ఇండియా, మినీమైమ్స్, క్రిస్పర్‌బిట్స్ వంటి సంస్థలతో యూనివర్సిటీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి ద్వారా బయోటెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో పరిశోధన, ప్రాక్టికల్ లెర్నింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్య అందించడమే తమ లక్ష్యమని ఏట్రియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజీవన్ మాధవన్ నాయర్ తెలిపారు.

“ఈ దశాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు వాతావరణ మార్పులు, ఎనర్జీ, ఆరోగ్యం, ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌కు సంబంధించినవి. వీటికి పరిష్కారాలు కనుగొనాలంటే వివిధ రంగాల పరిజ్ఞానం అవసరం. విద్యార్థుల్లో అలాంటి నైపుణ్యాలు పెంచాలన్న ఆలోచనే ఏట్రియా లిబరల్ ఎస్‌టీఈఎం విద్యా విధానానికి పునాది. హైదరాబాద్‌లో ఏఐ, లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో నాయకులుగా ఎదిగేవారు వివిధ విభాగాలపై అవగాహనతో పాటు తమ పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగే గ్రాడ్యుయేట్లే. 2027-28 విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థులకు మా యూనివర్సిటీలో స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నాం” అని ఆయన చెప్పారు.

ఏట్రియా యూనివర్సిటీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏట్రియా గ్రూప్‌లో భాగం. ఈ గ్రూప్‌కు డాక్టర్ సుందర్ రాజు నాయకత్వం వహిస్తున్నారు. భారత్‌లో ప్రముఖ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థల్లో ఒకటైన ఏసీటీ ఫైబర్‌నెట్‌ను ఆయనే స్థాపించారు. గ్రూప్‌లో ఏట్రియా పవర్ కూడా ఉంది. ఇది విండ్, సోలార్, హైడ్రో వంటి పునరుత్పాదక ఇంధన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాడిసన్ బ్లూ ఏట్రియా బెంగళూరు హోటల్ కూడా ఈ గ్రూప్‌లో భాగమే. ఎనర్జీ, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లో గ్రూప్‌కు ఉన్న అనుభవం యూనివర్సిటీ విద్యా విధానంలోనూ ఉపయోగపడుతోంది.

అడ్మిషన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?

2027-28 విద్యా సంవత్సరానికి ఏట్రియా యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు 2027 అక్టోబర్ 31 వరకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో మొదట అప్లికేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం ఎస్‌ఏటీ (SAT), జేఈఈ (JEE), సీయూఈటీ (CUET) పరీక్షల స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సులు ఉపయోగపడవచ్చు. పరిశ్రమల్లో పనిచేసే అనుభవం, రీసెర్చ్ అవకాశాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఈ యూనివర్సిటీ అందిస్తున్న ముఖ్యమైన అంశాలు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 4:01 pm Digital Edition : Prabhanews
ఏఐ నుంచి ఎనర్జీ సైన్సెస్ వరకు… ఏట్రియా యూనివర్సిటీలో 270 సీట్లు, స్కాలర్‌షిప్స్! | బిజినెస్

నాలుగు ప్రధాన విభాగాల్లో కోర్సులుఏట్రియా యూనివర్సిటీలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, లైఫ్ సైన్సెస్, ఎనర్జీ సైన్సెస్, ఈ-మొబిలిటీ విభాగాల్లో కోర్సులు అందిస్తున్నారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి కోర్ ఏఐ అండ్ ఫౌండేషన్ మోడల్స్, ఏఐ స్టీవార్డ్ (బాధ్యతాయుతమైన ఏఐ), సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్‌చెయిన్, హెల్త్‌కేర్‌లో ఏఐ వినియోగం, 3డీ బయోప్రింటింగ్ వంటి కొత్త స్పెషలైజేషన్లను ప్రవేశపెడుతున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులందరికీ ఒకే విధమైన ప్రాథమిక విద్య అందిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, ఎనర్జీ, మొబిలిటీ అంశాలపై మూడు వారాల చొప్పున ప్రత్యేక సెషన్లు ఉంటాయి. దీని వల్ల వివిధ రంగాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్న తర్వాత తమకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ, బయోటెక్నాలజీ రంగాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగుల అవసరం గణనీయంగా పెరగనుంది. వచ్చే రెండు నుంచి మూడేళ్లలో ఈ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. బెయిన్ అండ్ కంపెనీ అంచనాల ప్రకారం.. భారత్‌లో ఏఐ ఉద్యోగ ఖాళీలు 2027 నాటికి 23 లక్షలు దాటనున్నాయి. అందుబాటులో ఉన్న ఏఐ నిపుణుల సంఖ్య ఈ డిమాండ్‌లో సగం మాత్రమే ఉండొచ్చని అంచనా. అడెక్కో ఇండియా ప్రకారం.. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఏటా 15-20 శాతం పెరగనున్నాయి. సీఈఈడబ్ల్యూ-ఎన్‌ఆర్‌డీసీ అంచనాల ప్రకారం.. 2030 నాటికి క్లీన్ ఎనర్జీ రంగంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు ఏర్పడవచ్చు. బయోఎకానమీ రంగం విలువ కూడా 2030 నాటికి దాదాపు రెట్టింపై 300 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. డాక్టర్ రాజీవన్ మాధవన్ నాయర్ (వైస్ ఛాన్సలర్, అట్రియా యూనివర్సిటీ) & శ్రీ శశికమార్ ఎన్ (హెడ్ ఆఫ్ అవుట్‌రీచ్, అట్రియా యూనివర్సిటీ)తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులుహైదరాబాద్‌లో ఏఐ, లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాలకు సంబంధించిన కోర్సులు ఏట్రియా యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. 2026 ఆగస్టులో హైదరాబాద్‌లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్) ఉద్యోగ నియామకాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 48 శాతం పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 ద్వారా 2030 నాటికి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 84 మంది విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో ఏట్రియా యూనివర్సిటీలో చేరారు.విద్యార్థులకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలపై పనిచేసే అవకాశం కల్పించేందుకు ఏట్రియా యూనివర్సిటీలో ప్రత్యేకంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు. వీటిలో సింథటిక్ బయాలజీ ఏఐ (SynBioAI), ఏజెంటిక్ క్యాంపస్ మైక్రోగ్రిడ్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ, సన్ మొబిలిటీ, ముసాషి ఇండియా, మినీమైమ్స్, క్రిస్పర్‌బిట్స్ వంటి సంస్థలతో యూనివర్సిటీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి ద్వారా బయోటెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో పరిశోధన, ప్రాక్టికల్ లెర్నింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్య అందించడమే తమ లక్ష్యమని ఏట్రియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజీవన్ మాధవన్ నాయర్ తెలిపారు."ఈ దశాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు వాతావరణ మార్పులు, ఎనర్జీ, ఆరోగ్యం, ఇంటెలిజెంట్ సిస్టమ్స్‌కు సంబంధించినవి. వీటికి పరిష్కారాలు కనుగొనాలంటే వివిధ రంగాల పరిజ్ఞానం అవసరం. విద్యార్థుల్లో అలాంటి నైపుణ్యాలు పెంచాలన్న ఆలోచనే ఏట్రియా లిబరల్ ఎస్‌టీఈఎం విద్యా విధానానికి పునాది. హైదరాబాద్‌లో ఏఐ, లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో నాయకులుగా ఎదిగేవారు వివిధ విభాగాలపై అవగాహనతో పాటు తమ పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగే గ్రాడ్యుయేట్లే. 2027-28 విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యార్థులకు మా యూనివర్సిటీలో స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నాం" అని ఆయన చెప్పారు.ఏట్రియా యూనివర్సిటీ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏట్రియా గ్రూప్‌లో భాగం. ఈ గ్రూప్‌కు డాక్టర్ సుందర్ రాజు నాయకత్వం వహిస్తున్నారు. భారత్‌లో ప్రముఖ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవల సంస్థల్లో ఒకటైన ఏసీటీ ఫైబర్‌నెట్‌ను ఆయనే స్థాపించారు. గ్రూప్‌లో ఏట్రియా పవర్ కూడా ఉంది. ఇది విండ్, సోలార్, హైడ్రో వంటి పునరుత్పాదక ఇంధన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాడిసన్ బ్లూ ఏట్రియా బెంగళూరు హోటల్ కూడా ఈ గ్రూప్‌లో భాగమే. ఎనర్జీ, హాస్పిటాలిటీ, టెక్నాలజీ రంగాల్లో గ్రూప్‌కు ఉన్న అనుభవం యూనివర్సిటీ విద్యా విధానంలోనూ ఉపయోగపడుతోంది.అడ్మిషన్లకు చివరి తేదీ ఎప్పుడంటే?2027-28 విద్యా సంవత్సరానికి ఏట్రియా యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు 2027 అక్టోబర్ 31 వరకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో మొదట అప్లికేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం ఎస్‌ఏటీ (SAT), జేఈఈ (JEE), సీయూఈటీ (CUET) పరీక్షల స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సులు ఉపయోగపడవచ్చు. పరిశ్రమల్లో పనిచేసే అనుభవం, రీసెర్చ్ అవకాశాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఈ యూనివర్సిటీ అందిస్తున్న ముఖ్యమైన అంశాలు.

Source link