Last Updated:
మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘భోగి’ సినిమాపై అంచనాలు మెల్లి మెల్లిగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజైన ట్రైలర్ మాత్రం ఓ రేంజ్లో ఎక్కేసింది.
మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘భోగి’ సినిమాపై అంచనాలు మెల్లి మెల్లిగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజైన ట్రైలర్ మాత్రం ఓ రేంజ్లో ఎక్కేసింది. అసలు ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో పక్కన పెట్టేస్తే…. ట్రైలర్ మాత్రం ఓ రేంజ్లో బొమ్మ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేసింది. అసలు శర్వానంద్ ఇలాంటి ఒక రూటెడ్ క్యారెక్టర్‌ను ఎలా ఓన్ చేసుకున్నాడో చూడాలని చాలా మంది వేయిట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు బాయ్ నెక్స్ట్ డోర్ సినిమాలు.. అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేసిన శర్వా, ఇందులో మాత్రం కంప్లీట్ రూటెడ్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఇదొక కల్ట్ విలేజ్ యాక్షన్ డ్రామా అని ప్రమోషనల్ కంటెంట్‌తో క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ విలేజ్‌లో ఏం చూపిస్తాడు? అక్కడ ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే పాయింట్ ఏముంది? ఆ విలేజ్‌లోకి ఆడియెన్స్‌ను డైరెక్టర్ తీసుకెళ్తాడా? ఇలా చాలా మిలియన్ డాలర్ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఫుల్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ గురించి తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు తెలుగు ఓటీటీ రైట్స్‌తో పాటు మ్యూజిక్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపి దాదాపు రూ.20 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయిపోయిందని టాక్.
కాగా ఈ సినిమాకు.. రూ.40 కోట్ల వరకు బడ్జెట్ అయింది. అంటే ఈ లెక్కన కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఆల్రెడీ రూ.20 కోట్లు వచ్చాయి. ఇక ఇప్పుడున్న ఈ సినిమా హైప్‌కు మంచి బిజినెస్ కూడా జరుపుకుంటుంది. దానికి తోడు ఈ వారం ఆహా అనిపించే సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కావడం లేదు. అలా ఈ వారం భోగికి చాలా ప్లస్ కానుంది.
సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా సరే… శర్వానంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి కీలక రోల్ ప్లే చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది ‘నారీ నారీ నడుమ మురారీ’, ‘బైకర్’ సినిమాలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. ఇక ఇప్పుడు భోగితో హ్యాట్రిక్ కొడ్తాడా? లేదా? అనేది చూడాలి.

