Last Updated:
5 రోజుల కిందట రిలీజైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ మూవీకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. ఫ్రెండ్స్‌తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. చాలా మంది ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లి.. కాస్త డిజప్పాయింట్‌మెంట్‌తో బయటకు వచ్చాయి.
5 రోజుల కిందట రిలీజైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ మూవీకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. ఫ్రెండ్స్‌తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. చాలా మంది ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లి.. కాస్త డిజప్పాయింట్‌మెంట్‌తో బయటకు వచ్చాయి. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రం నచ్చుతుంది. మరీ ఫస్ట్ పార్ట్ రేంజ్‌లో ఎగ్జైట్ చేయలేదు అనేది మాత్రం వాస్తవం. అలా అని బాలేదని కూడా కాదు.. కానీ ఒక కంప్లీట్ బిర్యానీ తిన్న ఫీల్ అయితే రాదు.
టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం దుమ్మురేపుతున్నాయి. డే1 నుంచి సాలిడ్ కలెక్షన్లు రాబడుతూ వస్తుంది. ఈ సినిమా రిలీజై ఇప్పటికి 5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను.. రూ.11 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అదే విధంగా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే.. ఇప్పటి వరకు రూ.39 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు.. రూ.20 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది.
ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ.22 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్‌లో రూ.23 కోట్ల వరకు కొల్లగొట్టాల్సి ఉంటుంది. కాగా.. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే.. ఇంకా రూ.3 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడున్న ఈ సినిమా యుఫోరియాకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని… పైన రూ.10 కోట్ల వరకు లాభాలు కూడా తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే… వివేక్, అతని స్నేహితులు కలిసి తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ అవుతుంది. దీంతో ఆ సినిమా నిర్మాత రాబిన్ అప్పులపాలవుతాడు. అతని అప్పులు తీర్చేందుకు వివేక్ ఐదేళ్లుగా నిర్మాత దగ్గరే పని చేస్తుంటాడు. మరోవైపు కార్తీక్ కెమెరామెన్‌గా, కౌశిక్ రోజుకు లక్ష తీసుకునే ఆర్టిస్ట్‌గా, ఉప్పు ఎడిటర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంటారు. కీర్తన అలియాస్ శివాత్మిక తన తండ్రికి తెలియకుండా కార్తీక్ దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేస్తుంటుంది. కార్తీక్ ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆమెకు అంకిత్‌తో పెళ్లి నిశ్చయమవుతుంది.
ఈ క్రమంలో వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్ కలిసి అంకిత్‌కు బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేస్తారు. అక్కడ జరిగే ఓ సంఘటనతో పెళ్లి ఆగిపోతుంది. అసలు కీర్తన తండ్రి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? సినిమాలంటే ఇష్టం లేని ఆయన ఈ నలుగురు స్నేహితులకు పెట్టిన షరతు ఏంటి? మళ్లీ వీళ్లంతా కలిసి సినిమా తీశారా? తమ కలను నెరవేర్చుకున్నారా? అనేది మిగతా కథ.

