ప్రభన్యూస్

AI at Workplace: ఏఐ వాడకంలో మనమే తోపు… 100 మంది ఉద్యోగుల్లో 96 మంది ఫుల్లుగా వాడేస్తున్నారు! | బిజినెస్


Last Updated:

AI at Workplace | పని ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా బీసీజీ నివేదిక ప్రకారం, ఏఐ వాడకంలో భారత్ ఆసియా-పసిఫిక్ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 96 శాతం మంది ఉద్యోగులు ఏఐని క్రమం తప్పకుండా ఉపయోగిస్తుండగా, వారానికి సగటున 15 గంటల సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు.

AI at Workplace: ఏఐ వాడకంలో మనమే తోపు... 100 మంది ఉద్యోగుల్లో 96 మంది ఫుల్లుగా వాడేస్తున్నారు! (image: AI Generated)
AI at Workplace: ఏఐ వాడకంలో మనమే తోపు… 100 మంది ఉద్యోగుల్లో 96 మంది ఫుల్లుగా వాడేస్తున్నారు! (image: AI Generated)

పని ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో భారత్ ఆసియా-పసిఫిక్ దేశాలన్నింటికంటే ముందుంది. దేశంలో ఏకంగా 96 శాతం మంది ఉద్యోగులు ఏఐని తరచుగా ఉపయోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఏఐ సాయంతో ఉద్యోగులు వారానికి సగటున 15 గంటల సమయం ఆదా చేసుకుంటున్నారని తెలిపింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఏఐ వినియోగం ఎక్కువగా ఉంది. భారత ఉద్యోగుల్లో 96 శాతం మంది ప్రతిరోజూ లేదా వారానికి రెండు నుంచి మూడు సార్లు ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని అన్ని దేశాల సగటు 85 శాతంగా ఉంది. ఏఐ వల్ల భారత ఉద్యోగులు వారానికి సగటున 15 గంటలు ఆదా చేసుకుంటున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సమయం సగటున 9.4 గంటలుగా ఉంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉద్యోగులు ఏఐ సాయంతో ఎక్కువ సమయం ఆదా చేసుకుంటున్నారు.

ఆదా అయిన సమయాన్ని ఉద్యోగులు ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంలోనూ భారత్ ముందుంది. దేశంలో 61 శాతం మంది ఉద్యోగులు ఈ సమయాన్ని అదనపు వ్యూహాత్మక పనుల కోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సంఖ్య 44 శాతంగా ఉంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా 60 శాతంతో రెండో స్థానంలో ఉండగా, చైనా 37 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఏఐ వల్ల పని వేగం పెరగడమే కాకుండా, ఉద్యోగులు తమ దృష్టిని పెట్టాల్సిన పనులు కూడా మారుతున్నాయని బీసీజీ ఎక్స్ ఇండియా లీడర్ నిపుణ్ కల్రా చెప్పారు.

ఇది కూడా చదవండి: ఆ ఒక్క రోజు బంగారం, వెండి కొన్నవారికి పీడకలే మిగిలింది… జీవితాంతం గుర్తుండిపోయే రోజు!

“ఏఐ వల్ల పనులు త్వరగా పూర్తవుతున్నాయి. అంతేకాదు, ఉద్యోగులు తమ సమయాన్ని మరింత ముఖ్యమైన పనులపై కేటాయించగలుగుతున్నారు. ఏఐ నుంచి సంస్థలు మరింత ప్రయోజనం పొందాలంటే పని విధానాల్లో మార్పులు తీసుకురావాలి. ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలి. ఏఐని ఎలా ఉపయోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. అప్పుడే వ్యాపారానికి నిజమైన ప్రయోజనాలు అందుతాయి” అని ఆయన వివరించారు. అయితే, ఏఐ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దాని వ్యూహాత్మక ఉపయోగంపై ఉద్యోగులకు పూర్తి అవగాహన కల్పించడంలో ఇంకా లోటు ఉందని నివేదిక తెలిపింది. భారత్‌లో కేవలం 38 శాతం మంది ఉద్యోగులకే ఏఐ వినియోగంపై స్పష్టమైన వ్యూహాత్మక అవగాహన ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సంఖ్య కేవలం 20 శాతంగా ఉంది.

అంటే సంస్థలు ఏఐని ఎందుకు ఉపయోగిస్తున్నాయి? దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాయి? ఉద్యోగుల బాధ్యతలు ఏంటి? ఏఐ వల్ల ఆదా అయ్యే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేయాలి. ఏఐని సంస్థల ముఖ్యమైన ప్రాధాన్యతగా గుర్తించి, దానికి అనుగుణంగా సరైన ప్రణాళికలు రూపొందించాలి. ఉద్యోగులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని బీసీజీ పేర్కొంది. ఇక ఏఐపై ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ విషయంలోనూ కొన్ని వివరాలను నివేదిక వెల్లడించింది. భారత్‌లో 42 శాతం మంది ఉద్యోగులు తమకు అందుతున్న ఏఐ శిక్షణ సరిపోతుందని చెప్పారు. అలాగే 59 శాతం మంది ఉద్యోగులు తమ సంస్థల్లో మనుషులు, ఏఐ కలిసి పనిచేయడానికి అవసరమైన నియమాలు ఉన్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: Post Office Schemes: మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రిస్క్ లేకుండా 8.2% రిటర్న్స్ ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇవే!

ఈ వివరాలన్నీ బీసీజీ నిర్వహించిన రెండో వార్షిక ‘ఏపీఏసీ ఏఐ ఎట్ వర్క్’ సర్వేలో వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మొత్తం తొమ్మిది దేశాలకు చెందిన 6,349 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్ నుంచి 882 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే, పని ప్రదేశాల్లో ఏఐ వినియోగంలో భారత్ ముందంజలో ఉంది. ఏఐ సాయంతో ఉద్యోగులు సమయాన్ని ఆదా చేసుకుంటూ మరింత కీలకమైన పనులపై దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందాలంటే ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం, ఏఐ వినియోగంపై స్పష్టమైన అవగాహన కల్పించడం సంస్థలకు చాలా అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 4:42 pm Digital Edition : Prabhanews
AI at Workplace: ఏఐ వాడకంలో మనమే తోపు… 100 మంది ఉద్యోగుల్లో 96 మంది ఫుల్లుగా వాడేస్తున్నారు! | బిజినెస్

Last Updated:November 24, 2026 4:39 PM ISTAI at Workplace | పని ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా బీసీజీ నివేదిక ప్రకారం, ఏఐ వాడకంలో భారత్ ఆసియా-పసిఫిక్ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 96 శాతం మంది ఉద్యోగులు ఏఐని క్రమం తప్పకుండా ఉపయోగిస్తుండగా, వారానికి సగటున 15 గంటల సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు.AI at Workplace: ఏఐ వాడకంలో మనమే తోపు... 100 మంది ఉద్యోగుల్లో 96 మంది ఫుల్లుగా వాడేస్తున్నారు! (image: AI Generated)పని ప్రదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో భారత్ ఆసియా-పసిఫిక్ దేశాలన్నింటికంటే ముందుంది. దేశంలో ఏకంగా 96 శాతం మంది ఉద్యోగులు ఏఐని తరచుగా ఉపయోగిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఏఐ సాయంతో ఉద్యోగులు వారానికి సగటున 15 గంటల సమయం ఆదా చేసుకుంటున్నారని తెలిపింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఏఐ వినియోగం ఎక్కువగా ఉంది. భారత ఉద్యోగుల్లో 96 శాతం మంది ప్రతిరోజూ లేదా వారానికి రెండు నుంచి మూడు సార్లు ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని అన్ని దేశాల సగటు 85 శాతంగా ఉంది. ఏఐ వల్ల భారత ఉద్యోగులు వారానికి సగటున 15 గంటలు ఆదా చేసుకుంటున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సమయం సగటున 9.4 గంటలుగా ఉంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉద్యోగులు ఏఐ సాయంతో ఎక్కువ సమయం ఆదా చేసుకుంటున్నారు.ఆదా అయిన సమయాన్ని ఉద్యోగులు ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంలోనూ భారత్ ముందుంది. దేశంలో 61 శాతం మంది ఉద్యోగులు ఈ సమయాన్ని అదనపు వ్యూహాత్మక పనుల కోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సంఖ్య 44 శాతంగా ఉంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా 60 శాతంతో రెండో స్థానంలో ఉండగా, చైనా 37 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఏఐ వల్ల పని వేగం పెరగడమే కాకుండా, ఉద్యోగులు తమ దృష్టిని పెట్టాల్సిన పనులు కూడా మారుతున్నాయని బీసీజీ ఎక్స్ ఇండియా లీడర్ నిపుణ్ కల్రా చెప్పారు.ఇది కూడా చదవండి: ఆ ఒక్క రోజు బంగారం, వెండి కొన్నవారికి పీడకలే మిగిలింది... జీవితాంతం గుర్తుండిపోయే రోజు!"ఏఐ వల్ల పనులు త్వరగా పూర్తవుతున్నాయి. అంతేకాదు, ఉద్యోగులు తమ సమయాన్ని మరింత ముఖ్యమైన పనులపై కేటాయించగలుగుతున్నారు. ఏఐ నుంచి సంస్థలు మరింత ప్రయోజనం పొందాలంటే పని విధానాల్లో మార్పులు తీసుకురావాలి. ఉద్యోగులకు అవసరమైన నైపుణ్యాలు నేర్పించాలి. ఏఐని ఎలా ఉపయోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. అప్పుడే వ్యాపారానికి నిజమైన ప్రయోజనాలు అందుతాయి" అని ఆయన వివరించారు. అయితే, ఏఐ వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దాని వ్యూహాత్మక ఉపయోగంపై ఉద్యోగులకు పూర్తి అవగాహన కల్పించడంలో ఇంకా లోటు ఉందని నివేదిక తెలిపింది. భారత్‌లో కేవలం 38 శాతం మంది ఉద్యోగులకే ఏఐ వినియోగంపై స్పష్టమైన వ్యూహాత్మక అవగాహన ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సంఖ్య కేవలం 20 శాతంగా ఉంది.అంటే సంస్థలు ఏఐని ఎందుకు ఉపయోగిస్తున్నాయి? దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాయి? ఉద్యోగుల బాధ్యతలు ఏంటి? ఏఐ వల్ల ఆదా అయ్యే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అనే విషయాలను ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేయాలి. ఏఐని సంస్థల ముఖ్యమైన ప్రాధాన్యతగా గుర్తించి, దానికి అనుగుణంగా సరైన ప్రణాళికలు రూపొందించాలి. ఉద్యోగులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించాలని బీసీజీ పేర్కొంది. ఇక ఏఐపై ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ విషయంలోనూ కొన్ని వివరాలను నివేదిక వెల్లడించింది. భారత్‌లో 42 శాతం మంది ఉద్యోగులు తమకు అందుతున్న ఏఐ శిక్షణ సరిపోతుందని చెప్పారు. అలాగే 59 శాతం మంది ఉద్యోగులు తమ సంస్థల్లో మనుషులు, ఏఐ కలిసి పనిచేయడానికి అవసరమైన నియమాలు ఉన్నాయని తెలిపారు.ఇది కూడా చదవండి: Post Office Schemes: మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రిస్క్ లేకుండా 8.2% రిటర్న్స్ ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇవే!ఈ వివరాలన్నీ బీసీజీ నిర్వహించిన రెండో వార్షిక 'ఏపీఏసీ ఏఐ ఎట్ వర్క్' సర్వేలో వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మొత్తం తొమ్మిది దేశాలకు చెందిన 6,349 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా, చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్ నుంచి 882 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే, పని ప్రదేశాల్లో ఏఐ వినియోగంలో భారత్ ముందంజలో ఉంది. ఏఐ సాయంతో ఉద్యోగులు సమయాన్ని ఆదా చేసుకుంటూ మరింత కీలకమైన పనులపై దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందాలంటే ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం, ఏఐ వినియోగంపై స్పష్టమైన అవగాహన కల్పించడం సంస్థలకు చాలా అవసరం.మరింత చదవండి

Source link