ప్రభన్యూస్

మీ ఇంట్లోని బంగారంతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. అమ్మాల్సిన అవసరమే లేదు! | బిజినెస్


Last Updated:

మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా పెట్టుబడి చాలా ముఖ్యం. అయితే చేతిలో డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న బంగారమే వారికి ఆర్థిక అండగా నిలుస్తోంది. బంగారం అమ్మకుండానే గోల్డ్ లోన్ ద్వారా వ్యాపారానికి పెట్టుబడి ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

మీ ఇంట్లోని బంగారంతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. అమ్మాల్సిన అవసరమే లేదు! (ప్రతీకాత్మక చిత్రం)
మీ ఇంట్లోని బంగారంతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. అమ్మాల్సిన అవసరమే లేదు! (ప్రతీకాత్మక చిత్రం)

భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, చాలా మంది మహిళలకు సరైన సమయంలో పెట్టుబడి సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలే వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని అందించే మార్గంగా మారుతున్నాయి. భారత్‌లో మహిళల పేరుతో దాదాపు 3.69 కోట్ల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. దేశంలోని మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇవి సుమారు 38 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే చిన్న వ్యాపారాలు నిర్వహించే మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం అంత సులభం కాదు. ముఖ్యంగా గతంలో తీసుకున్న రుణాల వివరాలు (క్రెడిట్ హిస్టరీ) ఎక్కువగా లేకపోవడం, బ్యాంకులు అడిగే సంప్రదాయ ఆస్తుల రూపంలో హామీ చూపించలేకపోవడం వంటి కారణాలతో సకాలంలో ఆర్థిక సాయం అందడం కష్టమవుతోంది.

ఇలాంటి సమయంలో గోల్డ్ లోన్లు మహిళలకు ఉపయోగకరమైన ఆర్థిక మార్గంగా మారుతున్నాయి. తరతరాలుగా భారతీయ కుటుంబాలు బంగారాన్ని పొదుపు రూపంలో దాచుకుంటున్నాయి. ఇప్పుడు అదే బంగారాన్ని అమ్మకుండానే, దాన్ని తాకట్టు పెట్టి అవసరమైన డబ్బు పొందే అవకాశం ఉంది. ఈ డబ్బును వ్యాపారానికి కావాల్సిన సరుకులు కొనడానికి, యంత్రాలు, పరికరాలు సమకూర్చుకోవడానికి, రోజువారీ వ్యాపార ఖర్చులు చూసుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగించుకోవచ్చు. దేశంలో గోల్డ్ లోన్లకు పెరుగుతున్న ఆదరణ గణాంకాల్లోనూ కనిపిస్తోంది. 2026 ఆగస్టు నాటికి భారత్‌లో గోల్డ్ లోన్ల మొత్తం బకాయిలు రూ.22.5 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఆగస్టుతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2026 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా మంజూరైన గోల్డ్ లోన్లలో మహిళల వాటా 41 శాతంగా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ లోన్లలో దాదాపు మూడింట రెండొంతుల రుణాలు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి. అంటే పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ గోల్డ్ లోన్ల ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Loan: బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్… సిబిల్ నివేదికలో కీలక విషయాలు!

ఈ అంశంపై ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబెనెజర్ డేనియల్ జీ మాట్లాడుతూ.. “మహిళలకు ఆర్థిక సాయం అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని చాలామంది వారి పేరుపై ఉన్న ఆస్తులు, క్రెడిట్ హిస్టరీ, వ్యాపారం ఎంత పెద్దది, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాల ఆధారంగా చూస్తుంటారు. కానీ ఇలా చూడటం వల్ల మహిళలు ఎన్నో ఏళ్లుగా కూడబెట్టుకున్న ఆస్తులు, వారి ఆర్థిక స్థిరత్వం గురించి తెలుసుకోలేకపోతున్నాం. చాలా మంది భారతీయ మహిళలకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు. అది వారి పొదుపు, ఆర్థిక భద్రత. జీవితంలోని ఎన్నో దశల్లో కష్టపడి దాచుకున్న విలువైన ఆస్తి. అలాంటి బంగారాన్ని అమ్మాల్సిన అవసరం లేకుండానే, మహిళల ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఎలా ఉపయోగపడేలా చేయాలన్నదే అసలు ప్రశ్న. గోల్డ్ లోన్ ద్వారా మహిళలు తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. కొత్త ఆర్డర్లు తీసుకోవచ్చు. వ్యాపారానికి అవసరమైన సరుకులను ముందుగానే కొనుగోలు చేయవచ్చు. ఆదాయం ఒకేలా రాని సమయాల్లోనూ వ్యాపార ఖర్చులను నిర్వహించుకోవచ్చు. రుణాలు ఇచ్చే సంస్థలుగా మనం కూడా సంప్రదాయ రుణ అర్హతలున్న వారికే లోన్లు ఇవ్వాలనే ఆలోచన నుంచి బయటకు రావాలి. మహిళలు నిజంగా ఎలా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలను అర్థం చేసుకుని, వారికి సరిపోయే ఆర్థిక సదుపాయాలు అందించాలి. దీనికోసం రుణ నిబంధనలు స్పష్టంగా ఉండాలి. బాధ్యతాయుతంగా లోన్లు ఇవ్వాలి. మహిళల సమయాన్ని, వారి నిర్ణయాలను గౌరవించే విధంగా రుణ ప్రక్రియలు ఉండాలి. చివరికి ఒక మహిళ తాను ఇప్పటికే సంపాదించుకున్న ఆస్తిని కాపాడుకోవాలా? లేక తన భవిష్యత్తు వ్యాపార కలలను నిజం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టాలా? అనే రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు” అని వివరించారు.

ఇది కూడా చదవండి: Post Office Schemes: మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రిస్క్ లేకుండా 8.2% రిటర్న్స్ ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇవే!

భారత్ ఆర్థిక వ్యవస్థలో మహిళలు నడిపిస్తున్న వ్యాపారాల పాత్ర మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన సమయంలో, సులభంగా ఆర్థిక సాయం అందించే రుణ సదుపాయాలు కీలకంగా మారనున్నాయి. ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా గోల్డ్ లోన్లను సులభంగా, సురక్షితంగా, పారదర్శకంగా అందించడంపై దృష్టి పెడుతోంది. వినియోగదారులు తమ దగ్గరున్న బంగారాన్ని తెలివిగా ఉపయోగించుకుని వ్యక్తిగత అవసరాలు, వ్యాపార అవసరాలకు కావాల్సిన ఆర్థిక సాయం పొందేలా చేయడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే, మహిళల దగ్గర ఉన్న బంగారం ఇకపై కేవలం పొదుపు, ఆర్థిక భద్రతకు మాత్రమే పరిమితం కావడం లేదు. దాన్ని అమ్మకుండానే గోల్డ్ లోన్ ద్వారా వ్యాపార పెట్టుబడిగా మార్చుకుని, తమ సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 6:34 pm Digital Edition : Prabhanews
మీ ఇంట్లోని బంగారంతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. అమ్మాల్సిన అవసరమే లేదు! | బిజినెస్

Last Updated:November 24, 2026 6:19 PM ISTమహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా పెట్టుబడి చాలా ముఖ్యం. అయితే చేతిలో డబ్బులు లేకపోతే ఇంట్లో ఉన్న బంగారమే వారికి ఆర్థిక అండగా నిలుస్తోంది. బంగారం అమ్మకుండానే గోల్డ్ లోన్ ద్వారా వ్యాపారానికి పెట్టుబడి ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.మీ ఇంట్లోని బంగారంతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. అమ్మాల్సిన అవసరమే లేదు! (ప్రతీకాత్మక చిత్రం)భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, చాలా మంది మహిళలకు సరైన సమయంలో పెట్టుబడి సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలే వ్యాపారానికి అవసరమైన పెట్టుబడిని అందించే మార్గంగా మారుతున్నాయి. భారత్‌లో మహిళల పేరుతో దాదాపు 3.69 కోట్ల రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. దేశంలోని మొత్తం రిజిస్ట్రేషన్లలో ఇవి సుమారు 38 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే చిన్న వ్యాపారాలు నిర్వహించే మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం అంత సులభం కాదు. ముఖ్యంగా గతంలో తీసుకున్న రుణాల వివరాలు (క్రెడిట్ హిస్టరీ) ఎక్కువగా లేకపోవడం, బ్యాంకులు అడిగే సంప్రదాయ ఆస్తుల రూపంలో హామీ చూపించలేకపోవడం వంటి కారణాలతో సకాలంలో ఆర్థిక సాయం అందడం కష్టమవుతోంది.ఇలాంటి సమయంలో గోల్డ్ లోన్లు మహిళలకు ఉపయోగకరమైన ఆర్థిక మార్గంగా మారుతున్నాయి. తరతరాలుగా భారతీయ కుటుంబాలు బంగారాన్ని పొదుపు రూపంలో దాచుకుంటున్నాయి. ఇప్పుడు అదే బంగారాన్ని అమ్మకుండానే, దాన్ని తాకట్టు పెట్టి అవసరమైన డబ్బు పొందే అవకాశం ఉంది. ఈ డబ్బును వ్యాపారానికి కావాల్సిన సరుకులు కొనడానికి, యంత్రాలు, పరికరాలు సమకూర్చుకోవడానికి, రోజువారీ వ్యాపార ఖర్చులు చూసుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగించుకోవచ్చు. దేశంలో గోల్డ్ లోన్లకు పెరుగుతున్న ఆదరణ గణాంకాల్లోనూ కనిపిస్తోంది. 2026 ఆగస్టు నాటికి భారత్‌లో గోల్డ్ లోన్ల మొత్తం బకాయిలు రూ.22.5 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఆగస్టుతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2026 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కొత్తగా మంజూరైన గోల్డ్ లోన్లలో మహిళల వాటా 41 శాతంగా ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ లోన్లలో దాదాపు మూడింట రెండొంతుల రుణాలు సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి. అంటే పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ గోల్డ్ లోన్ల ద్వారా ఆర్థిక సాయం పొందే అవకాశం పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: Gold Loan: బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నవారికి బిగ్ అలర్ట్... సిబిల్ నివేదికలో కీలక విషయాలు!ఈ అంశంపై ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబెనెజర్ డేనియల్ జీ మాట్లాడుతూ.. "మహిళలకు ఆర్థిక సాయం అందుబాటులో ఉందా లేదా అనే విషయాన్ని చాలామంది వారి పేరుపై ఉన్న ఆస్తులు, క్రెడిట్ హిస్టరీ, వ్యాపారం ఎంత పెద్దది, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాల ఆధారంగా చూస్తుంటారు. కానీ ఇలా చూడటం వల్ల మహిళలు ఎన్నో ఏళ్లుగా కూడబెట్టుకున్న ఆస్తులు, వారి ఆర్థిక స్థిరత్వం గురించి తెలుసుకోలేకపోతున్నాం. చాలా మంది భారతీయ మహిళలకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు. అది వారి పొదుపు, ఆర్థిక భద్రత. జీవితంలోని ఎన్నో దశల్లో కష్టపడి దాచుకున్న విలువైన ఆస్తి. అలాంటి బంగారాన్ని అమ్మాల్సిన అవసరం లేకుండానే, మహిళల ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఎలా ఉపయోగపడేలా చేయాలన్నదే అసలు ప్రశ్న. గోల్డ్ లోన్ ద్వారా మహిళలు తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. కొత్త ఆర్డర్లు తీసుకోవచ్చు. వ్యాపారానికి అవసరమైన సరుకులను ముందుగానే కొనుగోలు చేయవచ్చు. ఆదాయం ఒకేలా రాని సమయాల్లోనూ వ్యాపార ఖర్చులను నిర్వహించుకోవచ్చు. రుణాలు ఇచ్చే సంస్థలుగా మనం కూడా సంప్రదాయ రుణ అర్హతలున్న వారికే లోన్లు ఇవ్వాలనే ఆలోచన నుంచి బయటకు రావాలి. మహిళలు నిజంగా ఎలా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలను అర్థం చేసుకుని, వారికి సరిపోయే ఆర్థిక సదుపాయాలు అందించాలి. దీనికోసం రుణ నిబంధనలు స్పష్టంగా ఉండాలి. బాధ్యతాయుతంగా లోన్లు ఇవ్వాలి. మహిళల సమయాన్ని, వారి నిర్ణయాలను గౌరవించే విధంగా రుణ ప్రక్రియలు ఉండాలి. చివరికి ఒక మహిళ తాను ఇప్పటికే సంపాదించుకున్న ఆస్తిని కాపాడుకోవాలా? లేక తన భవిష్యత్తు వ్యాపార కలలను నిజం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టాలా? అనే రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదు" అని వివరించారు.ఇది కూడా చదవండి: Post Office Schemes: మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? రిస్క్ లేకుండా 8.2% రిటర్న్స్ ఇచ్చే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇవే!భారత్ ఆర్థిక వ్యవస్థలో మహిళలు నడిపిస్తున్న వ్యాపారాల పాత్ర మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన సమయంలో, సులభంగా ఆర్థిక సాయం అందించే రుణ సదుపాయాలు కీలకంగా మారనున్నాయి. ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా గోల్డ్ లోన్లను సులభంగా, సురక్షితంగా, పారదర్శకంగా అందించడంపై దృష్టి పెడుతోంది. వినియోగదారులు తమ దగ్గరున్న బంగారాన్ని తెలివిగా ఉపయోగించుకుని వ్యక్తిగత అవసరాలు, వ్యాపార అవసరాలకు కావాల్సిన ఆర్థిక సాయం పొందేలా చేయడమే సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే, మహిళల దగ్గర ఉన్న బంగారం ఇకపై కేవలం పొదుపు, ఆర్థిక భద్రతకు మాత్రమే పరిమితం కావడం లేదు. దాన్ని అమ్మకుండానే గోల్డ్ లోన్ ద్వారా వ్యాపార పెట్టుబడిగా మార్చుకుని, తమ సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది.మరింత చదవండి

Source link