PM Modi: ‘అకాలీదళ్‌తో మాది సహజ కూటమి.. పంజాబ్‌ను ప్రగతి పథంలో నడిపిస్తాం: ప్రధాని మోదీ! |


Last Updated:

2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపాయి. ఎన్డీయేలోకి అకాలీదళ్ పునరాగమనాన్ని ప్రధాని మోదీ స్వాగతించగా, సీఎం పీఠం అకాలీదళ్‌కే దక్కుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

News18
News18

పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) మళ్లీ జట్టుకట్టాయి. శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఎన్డీయే కుటుంబంలోకి అత్యంత పురాతన మిత్రపక్షమైన అకాలీదళ్ తిరిగి రావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు.

పంజాబ్, పంజాబీల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. తమది సహజమైన కూటమి అని, ప్రజానుకూల పాలనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ తీర్చిదిద్దిన ఈ కూటమి కాలపరీక్షలో నిలిచిందని, పంజాబ్ ప్రజల తొలి ప్రాధాన్యతగా నిలుస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలిసి మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.

కూటమిలో ‘పెద్దన్న’ అకాలీదళ్.. సీఎం పదవి వారికే: అమిత్ షా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన అమిత్ షా, కూటమిలో అకాలీదళ్ ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. 2020లో మూడు సాగు చట్టాలపై నిరసనల నేపథ్యంలో 24 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకు వెళ్లింది. ఆ చట్టాలనే రద్దు చేసినందున ఇకపై ఎలాంటి సమస్యలకు తావులేదని షా అన్నారు. పంజాబ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేస్తామని, సీట్ల సర్దుబాటుపై త్వరలో చర్చిస్తామని నితిన్ నబీన్ తెలిపారు.

బీజేపీతో పొత్తును రాజకీయ ఒప్పందం కాదని, ఇదొక భావోద్వేగ బంధమని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అభివర్ణించారు. డ్రగ్స్ మహమ్మారి సహా పంజాబ్ సమస్యలన్నింటినీ తమ కూటమి పరిష్కరిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తమ కూటమి వందకు పైగా సీట్లు గెలుస్తుందని, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని బాదల్ ధీమా వ్యక్తం చేశారు. 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

డిసెంబర్ 8న జరగనున్న తన తండ్రి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని సుఖ్‌బీర్ బాదల్ వెల్లడించారు. కాగా, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. అప్పుడు 117 సీట్లలో అకాలీదళ్ 3, బీజేపీ 2 స్థానాలకే పరిమితమయ్యాయి. తాజా పునఃకలయిక పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 3:56 pm Digital Edition : Prabhanews
PM Modi: ‘అకాలీదళ్‌తో మాది సహజ కూటమి.. పంజాబ్‌ను ప్రగతి పథంలో నడిపిస్తాం: ప్రధాని మోదీ! |

Last Updated:Nov 24, 2026 3:52 PM IST2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీజేపీ, శిరోమణి అకాలీదళ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపాయి. ఎన్డీయేలోకి అకాలీదళ్ పునరాగమనాన్ని ప్రధాని మోదీ స్వాగతించగా, సీఎం పీఠం అకాలీదళ్‌కే దక్కుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.News18పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) మళ్లీ జట్టుకట్టాయి. శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఎన్డీయే కుటుంబంలోకి అత్యంత పురాతన మిత్రపక్షమైన అకాలీదళ్ తిరిగి రావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు.పంజాబ్, పంజాబీల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. తమది సహజమైన కూటమి అని, ప్రజానుకూల పాలనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ తీర్చిదిద్దిన ఈ కూటమి కాలపరీక్షలో నిలిచిందని, పంజాబ్ ప్రజల తొలి ప్రాధాన్యతగా నిలుస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు కలిసి మొత్తం 117 స్థానాల్లో పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.కూటమిలో ‘పెద్దన్న’ అకాలీదళ్.. సీఎం పదవి వారికే: అమిత్ షాబీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన అమిత్ షా, కూటమిలో అకాలీదళ్ ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. 2020లో మూడు సాగు చట్టాలపై నిరసనల నేపథ్యంలో 24 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్డీయే నుంచి అకాలీదళ్ బయటకు వెళ్లింది. ఆ చట్టాలనే రద్దు చేసినందున ఇకపై ఎలాంటి సమస్యలకు తావులేదని షా అన్నారు. పంజాబ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేస్తామని, సీట్ల సర్దుబాటుపై త్వరలో చర్చిస్తామని నితిన్ నబీన్ తెలిపారు.
Putting Punjab and the welfare of Punjabis first!
I am extremely delighted that the Shiromani Akali Dal returns to the NDA family and that too on the Parkash Purab of Sri Guru Nanak Dev Ji.Ours is a natural alliance that will ensure Punjab gets pro-people governance that takes the state to new heights of progress.Nurtured by Atal Ji, Advani Ji and Sardar Parkash Singh Badal Ji, the Akali Dal-BJP Alliance has stood the test of time.I am confident that our Alliance will emerge as the preferred choice of the people of Punjab.ਪੰਜਾਬ ਅਤੇ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਭਲਾਈ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ!ਮੈਨੂੰ ਬੇਹੱਦ ਖ਼ੁਸ਼ੀ ਹੈ ਕਿ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਐੱਨਡੀਏ ਪਰਿਵਾਰ ਵਿੱਚ ਵਾਪਸ ਪਰਤਿਆ ਹੈ ਅਤੇ ਉਹ ਵੀ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ’ਤੇ।ਸਾਡਾ ਇੱਕ ਸੁਭਾਵਿਕ ਗੱਠਜੋੜ ਹੈ, ਜੋ ਇਹ ਯਕੀਨੀ ਬਣਾਏਗਾ ਕਿ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਲੋਕ-ਪੱਖੀ ਸਰਕਾਰ ਮਿਲੇ, ਜੋ ਸੂਬੇ ਨੂੰ ਤਰੱਕੀ ਦੀਆਂ ਨਵੀਆਂ ਉਚਾਈਆਂ ’ਤੇ ਲੈ ਕੇ ਜਾਵੇ।ਅਟਲ ਜੀ, ਅਡਵਾਨੀ ਜੀ ਅਤੇ ਸਰਦਾਰ ਪ੍ਰਕਾਸ਼ ਸਿੰਘ ਬਾਦਲ ਜੀ ਵੱਲੋਂ ਸਿੰਜਿਆ ਗਿਆ ਅਕਾਲੀ ਦਲ-ਭਾਜਪਾ ਗੱਠਜੋੜ ਹਮੇਸ਼ਾ ਸਮੇਂ ਦੀ ਕਸੌਟੀ ’ਤੇ ਖਰਾ ਉਤਰਿਆ ਹੈ।ਮੈਨੂੰ ਪੂਰਾ ਵਿਸ਼ਵਾਸ ਹੈ ਕਿ ਸਾਡਾ ਗੱਠਜੋੜ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਦੀ ਪਹਿਲੀ ਪਸੰਦ ਵਜੋਂ ਉੱਭਰੇਗਾ।@Akali_Dal_ @BJP4India— Narendra Modi (@narendramodi) November 24, 2026బీజేపీతో పొత్తును రాజకీయ ఒప్పందం కాదని, ఇదొక భావోద్వేగ బంధమని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అభివర్ణించారు. డ్రగ్స్ మహమ్మారి సహా పంజాబ్ సమస్యలన్నింటినీ తమ కూటమి పరిష్కరిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో తమ కూటమి వందకు పైగా సీట్లు గెలుస్తుందని, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని బాదల్ ధీమా వ్యక్తం చేశారు. 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.డిసెంబర్ 8న జరగనున్న తన తండ్రి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని సుఖ్‌బీర్ బాదల్ వెల్లడించారు. కాగా, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిన్నాయి. అప్పుడు 117 సీట్లలో అకాలీదళ్ 3, బీజేపీ 2 స్థానాలకే పరిమితమయ్యాయి. తాజా పునఃకలయిక పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది.మరింత చదవండి

Source link