ప్రభన్యూస్

Ramayana: ఆస్కార్ బరిలో ‘రామాయణ’.. ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాస దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది.

News18
News18

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాస దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతోంది. తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక 99వ ఆస్కార్ (Oscars) అవార్డుల బరిలో పోటీకి నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది. ఆస్కార్ పోటీలో కూడా రామాయణ తనదైన ముద్ర వేస్తుందా? లేదా అనేది తాజాగా చర్చనీయాంశం అయింది.

ఆస్కార్ బరిలోకి వెళ్లేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ద్వారా దేశం తరఫున అధికారికంగా ఒక సినిమాను పంపుతారనే విషయం తెలిసిందే. అయితే, అకాడమీ నిర్దేశించిన అర్హతలను, సాంకేతిక ప్రమాణాలను పూర్తి చేసిన ఏ చిత్రమైనా ఇతర జనరల్ విభాగాల్లో స్వతంత్రంగా (Independent entry) పోటీకి తమ పేర్లను పంపించుకోవచ్చు. ఈ నిబంధనల మేరకే, ‘రామాయణ’ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను జనరల్ కేటగిరీల కింద 99వ అకాడమీ అవార్డుల పరిశీలన (For Your Consideration) కోసం పంపించినట్లు తెలుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి ప్రధాన విభాగాల్లో ఈ సినిమా నామినేషన్స్ రేసులో నిలవనుంది.

కాగా, 99వ ఆస్కార్ అవార్డుల ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారత్ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్’ (Gondhal) ఇప్పటికే అధికారిక ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. దీనికి తోడు టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (TIFF) ప్రఖ్యాత ప్లాట్‌ఫామ్ అవార్డు గెలుచుకున్న ‘అంఘ్‌’ (Angh) అనే మరో చిత్రం కూడా ఇదే విభాగంలో పరిశీలనకు అర్హత సాధించింది. ఇప్పుడు వీటి సరసన కమర్షియల్ బ్లాక్ బస్టర్ ‘రామాయణ’ కూడా ఇండిపెండెంట్ ఎంట్రీగా ఆస్కార్ అకాడమీకి వెళ్లడం భారతీయ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

రామాయణ ఇతిహాసాన్ని అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ బడ్జెట్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX) తో వెండితెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. విడుదలైన తొలివారం లోనే ఈ విజువల్ వండర్ రూ.800 కోట్ల భారీ వసూళ్లను సాధించి, వెయ్యి కోట్ల క్లబ్ (1000 Crore Club) దిశగా దూసుకుపోతోంది. స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తానికి ‘రామాయణ’ చిత్రం అటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే, ఇటు అంతర్జాతీయ అవార్డుల వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటేందుకు సిద్ధమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 November 2026, 1:26 pm Digital Edition : Prabhanews
Ramayana: ఆస్కార్ బరిలో ‘రామాయణ’.. ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 11, 2026 1:13 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాస దృశ్యకావ్యం 'రామాయణ' (Ramayana) బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది.News18బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాస దృశ్యకావ్యం 'రామాయణ' (Ramayana) బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతోంది. తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక 99వ ఆస్కార్ (Oscars) అవార్డుల బరిలో పోటీకి నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది. ఆస్కార్ పోటీలో కూడా రామాయణ తనదైన ముద్ర వేస్తుందా? లేదా అనేది తాజాగా చర్చనీయాంశం అయింది.ఆస్కార్ బరిలోకి వెళ్లేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ద్వారా దేశం తరఫున అధికారికంగా ఒక సినిమాను పంపుతారనే విషయం తెలిసిందే. అయితే, అకాడమీ నిర్దేశించిన అర్హతలను, సాంకేతిక ప్రమాణాలను పూర్తి చేసిన ఏ చిత్రమైనా ఇతర జనరల్ విభాగాల్లో స్వతంత్రంగా (Independent entry) పోటీకి తమ పేర్లను పంపించుకోవచ్చు. ఈ నిబంధనల మేరకే, 'రామాయణ' చిత్ర నిర్మాతలు ఈ సినిమాను జనరల్ కేటగిరీల కింద 99వ అకాడమీ అవార్డుల పరిశీలన (For Your Consideration) కోసం పంపించినట్లు తెలుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి ప్రధాన విభాగాల్లో ఈ సినిమా నామినేషన్స్ రేసులో నిలవనుంది.కాగా, 99వ ఆస్కార్ అవార్డుల 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో భారత్ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్’ (Gondhal) ఇప్పటికే అధికారిక ఎంట్రీగా ఎంపికైన విషయం తెలిసిందే. దీనికి తోడు టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (TIFF) ప్రఖ్యాత ప్లాట్‌ఫామ్ అవార్డు గెలుచుకున్న 'అంఘ్‌' (Angh) అనే మరో చిత్రం కూడా ఇదే విభాగంలో పరిశీలనకు అర్హత సాధించింది. ఇప్పుడు వీటి సరసన కమర్షియల్ బ్లాక్ బస్టర్ 'రామాయణ' కూడా ఇండిపెండెంట్ ఎంట్రీగా ఆస్కార్ అకాడమీకి వెళ్లడం భారతీయ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.రామాయణ ఇతిహాసాన్ని అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ బడ్జెట్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX) తో వెండితెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. విడుదలైన తొలివారం లోనే ఈ విజువల్ వండర్ రూ.800 కోట్ల భారీ వసూళ్లను సాధించి, వెయ్యి కోట్ల క్లబ్ (1000 Crore Club) దిశగా దూసుకుపోతోంది. స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తానికి 'రామాయణ' చిత్రం అటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే, ఇటు అంతర్జాతీయ అవార్డుల వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటేందుకు సిద్ధమైంది.మరింత చదవండి

Source link