నిర్మల్ కార్యక్రమం ద్వారా డేటా వ్యవస్థను మెరుగుపరచడం, డేటాను విశ్లేషించడం వంటి పనులు చేస్తున్నారు. సక్షమ్ ద్వారా వాహనాల లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ సహా రియల్ టైమ్ డేటా అనుసంధానాన్ని బలోపేతం చేస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ దగ్గరి నుంచి రేషన్ షాపులకు చేరే వరకు ప్రతి దశను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. సార్థక్-పీడీఎస్ పథకం ద్వారా రాష్ట్రాల పరిధిలో ఆహార ధాన్యాల రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్, నిర్వహణ ఖర్చులకు ఆర్థిక సాయం అందిస్తారు. రేషన్ షాపుల డీలర్లకు రావాల్సిన మార్జిన్ మొత్తాన్ని కూడా అందిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకే విధంగా పనిచేసే, ప్రజలకు ఉపయోగపడే, వివిధ వ్యవస్థలతో అనుసంధానం అయ్యే పీడీఎస్ వ్యవస్థను రూపొందించడం ఈ పథకం లక్ష్యం. రేషన్ చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా చూడటం, మధ్యలో జరిగే అక్రమాలను తగ్గించడం, జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం 2031 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. టెక్నాలజీతో రేషన్ వ్యవస్థలో ఆధునిక మార్పులు తీసుకొచ్చేందుకు స్మార్ట్-పీడీఎస్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఇది సార్థక్-పీడీఎస్‌లో భాగంగా పనిచేస్తుంది. రేషన్ కార్డులు, రేషన్ పంపిణీ, సరఫరా వ్యవస్థ, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలను ఒకే డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టెక్నాలజీ పరంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిచేసేందుకు కేంద్ర స్థాయిలో సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

