Last Updated:
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో శివ, ప్రియాంక జైన్ నిశ్చితార్థం జరగడం పలు చర్చలకు దారి తీసింది. ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్న కొందరు బిగ్ బాస్ షోపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ షోపై సోషల్ మీడియాలో వచ్చినన్ని ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మరే షోపై కూడా వచ్చిఉండవు. బుల్లితెర భారీ రియాలిటీ షో అని చెప్పడం వరకు ఓకే కానీ, ఇది జనాల మైండ్ సెట్ మార్చే వల్గర్ షో అంటూ కొందరు ప్రముఖులు చేసిన కామెంట్స్ ఇప్పటికీ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో శివ, ప్రియాంక జైన్ నిశ్చితార్థం జరగడం మరో చర్చకు దారి తీసింది.
శివ, ప్రియాంక జైన్ ఇద్దరూ మోకాళ్లపై కూర్చొని ఒకరికొకరు ఉంగరాలు ఇచ్చుకుంటూ పెళ్లి ప్రతిపాదన చేసుకున్నారు. ఇద్దరూ అంగీకారం తెలపడంతో రింగ్స్ మార్చుకున్నారు. ఆ తర్వాత దండలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని ఘనంగా జరుపుకున్నారు. హౌస్ సభ్యులంతా ఈ జంటను ఎత్తుకొని సందడి చేశారు. పెళ్లి పాటకు కలిసి డ్యాన్స్ చేస్తూ వేడుకను మరింత ఉత్సాహంగా మార్చారు.
ఇది చూసి.. అరె, ఇప్పటికే పెళ్ళైనవాళ్లకు ఎంగేజ్‌మెంట్ ఏంట్రా బాబూ.. జనాలకు పిచ్చోళ్లను చేస్తున్నారా అంటూ బిగ్ బాస్ పై తెగ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అంతేకాదు ఇదిగో శివ, ప్రియాంక జైన్ పెళ్లి ఫోటో అంటూ ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్టులు చూసి జనం పరేషాన్ అవుతున్నారు. ఇదేంటిది, నిజంగానే బిగ్ బాస్ షో మనందరినీ పిచ్చోళ్లను చేస్తోందా? అని అయోమయంలో పడిపోతున్నారు.
G lo kottali BB Team kodukulani ..
” FIRST-EVER IN BIGG BOSS HISTORY! 💍” anta 🤣..Mari identi ra ? 👇👇
#BiggBossTelugu10 https://t.co/rbP7FupVzf
— Bhookampam Srustisthaanu (@Bhayam_Putistha) November 11, 2026
శివ, ప్రియాంక జైన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉండటమే కాదు సహ జీవనం చేస్తున్న మాట వాస్తవమే కానీ, వాళ్లకు ఇప్పటికే పెళ్ళైపోయిందని సరైన ఆధారాలు మాత్రం కనిపించడం లేదు. ఈ జంట వచ్చే ఏడాది వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారని తెలుస్తోంది. ఏదేమైనా చరిత్రలో తొలిసారి బిగ్ బాస్ హౌస్ లో ఓ జంట నిశ్చితార్థం జరగడంతో ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

