ప్రభన్యూస్

PM Modi: మోదీ సర్కార్ నుంచి యువతకు భారీ భరోసా.. ఉద్యోగం వస్తే రూ.15 వేలు.. |


Last Updated:

దేశంలో ఉపాధి పెంపునకు కేంద్రం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన తెచ్చింది. రూ.99,446 కోట్లతో చేపట్టిన ఈ పథకంతో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. తొలి ఉద్యోగానికి రూ.15 వేల ఆర్థిక సాయం, కంపెనీ

News18
News18

దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రైవేటు సంస్థలు ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY). ఉద్యోగం పొందిన యువతకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు, కొత్తగా నియామకాలు చేపట్టే సంస్థలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది లక్ష్యం. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు ఈ పథకం కింద ఏర్పడే ఉద్యోగాలకు ప్రయోజనాలు వర్తిస్తాయి. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం 2025 జూలై 1న ఆమోదం తెలిపింది.

తొలిసారి ఉద్యోగం పొందితే రూ.15 వేల వరకు

చదువు పూర్తిచేసుకుని మొదటిసారి అధికారిక ఉద్యోగంలో చేరే యువతకు ఈ పథకం ద్వారా ఒక నెల ఈపీఎఫ్ వేతనానికి సమానమైన ప్రోత్సాహకం అందుతుంది. గరిష్ఠంగా రూ.15,000 వరకు పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో రెండు విడతలుగా జమ చేస్తారు. ఆరు నెలల నిరంతర ఉద్యోగం పూర్తయిన తర్వాత మొదటి విడత, 12 నెలల సేవ పూర్తయ్యాక రెండో విడత అందుతుంది.

18 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు, నెలకు రూ.లక్షలోపు వేతనం పొందేవారు అర్హులు. 2025 ఆగస్టు 1కి ముందు ఈపీఎఫ్‌వో లేదా మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టులో సభ్యులై ఉండకూడదు. రెండో విడత కోసం ఉచిత ఆర్థిక అక్షరాస్యత కోర్సు పూర్తి చేయాలి. ఉమంగ్ యాప్‌లో ముఖ గుర్తింపు విధానం ద్వారా యూఏఎన్ నంబర్ పొందడం కూడా తప్పనిసరి.

ఉద్యోగాలు కల్పించే కంపెనీలకూ కేంద్రం సాయం

కొత్తగా ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు ఒక్కో అదనపు ఉద్యోగిపై నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. సాధారణ రంగాల్లో రెండేళ్లు, తయారీ రంగంలో నాలుగేళ్ల పాటు ఈ ప్రయోజనం అందుతుంది.

సంస్థలకు ఉండాల్సిన అర్హతలు

ఈపీఎఫ్ చట్టం-1952 కింద నమోదై, నెలవారీ ఈసీఆర్ దాఖలు చేసే సంస్థలే అర్హులు. 50 మందిలోపు ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న సంస్థలు ఐదుగురిని అదనంగా నియమించుకోవాలి. కొత్త ఉద్యోగుల వేతనం రూ.లక్షలోపు ఉండాలి. వారు కనీసం ఆరు నెలలు కొనసాగాలి. సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకం పాన్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో ఆరు నెలలకు ఒకసారి జమ అవుతుంది.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు

అర్హ సంస్థలు అధికారిక ఈపీఎఫ్‌వో పీఎం-వీబీఆర్‌వై పోర్టల్ లేదా కార్మిక మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకోవచ్చు. యువతకు ఆర్థిక చేయూత, పరిశ్రమలకు నియామకాల ప్రోత్సాహం అందించడం ద్వారా ఉపాధి కల్పనను విస్తరించాలన్నది ఈ పథకం లక్ష్యం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 7:05 pm Digital Edition : Prabhanews
PM Modi: మోదీ సర్కార్ నుంచి యువతకు భారీ భరోసా.. ఉద్యోగం వస్తే రూ.15 వేలు.. |

Last Updated:Nov 10, 2026 7:01 PM ISTదేశంలో ఉపాధి పెంపునకు కేంద్రం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన తెచ్చింది. రూ.99,446 కోట్లతో చేపట్టిన ఈ పథకంతో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. తొలి ఉద్యోగానికి రూ.15 వేల ఆర్థిక సాయం, కంపెనీNews18దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రైవేటు సంస్థలు ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY). ఉద్యోగం పొందిన యువతకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు, కొత్తగా నియామకాలు చేపట్టే సంస్థలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. ఈ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది లక్ష్యం. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు ఈ పథకం కింద ఏర్పడే ఉద్యోగాలకు ప్రయోజనాలు వర్తిస్తాయి. మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం 2025 జూలై 1న ఆమోదం తెలిపింది.తొలిసారి ఉద్యోగం పొందితే రూ.15 వేల వరకుచదువు పూర్తిచేసుకుని మొదటిసారి అధికారిక ఉద్యోగంలో చేరే యువతకు ఈ పథకం ద్వారా ఒక నెల ఈపీఎఫ్ వేతనానికి సమానమైన ప్రోత్సాహకం అందుతుంది. గరిష్ఠంగా రూ.15,000 వరకు పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో రెండు విడతలుగా జమ చేస్తారు. ఆరు నెలల నిరంతర ఉద్యోగం పూర్తయిన తర్వాత మొదటి విడత, 12 నెలల సేవ పూర్తయ్యాక రెండో విడత అందుతుంది.18 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్న భారతీయులు, నెలకు రూ.లక్షలోపు వేతనం పొందేవారు అర్హులు. 2025 ఆగస్టు 1కి ముందు ఈపీఎఫ్‌వో లేదా మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టులో సభ్యులై ఉండకూడదు. రెండో విడత కోసం ఉచిత ఆర్థిక అక్షరాస్యత కోర్సు పూర్తి చేయాలి. ఉమంగ్ యాప్‌లో ముఖ గుర్తింపు విధానం ద్వారా యూఏఎన్ నంబర్ పొందడం కూడా తప్పనిసరి.ఉద్యోగాలు కల్పించే కంపెనీలకూ కేంద్రం సాయంకొత్తగా ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు ఒక్కో అదనపు ఉద్యోగిపై నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. సాధారణ రంగాల్లో రెండేళ్లు, తయారీ రంగంలో నాలుగేళ్ల పాటు ఈ ప్రయోజనం అందుతుంది.సంస్థలకు ఉండాల్సిన అర్హతలుఈపీఎఫ్ చట్టం-1952 కింద నమోదై, నెలవారీ ఈసీఆర్ దాఖలు చేసే సంస్థలే అర్హులు. 50 మందిలోపు ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఇద్దరిని, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న సంస్థలు ఐదుగురిని అదనంగా నియమించుకోవాలి. కొత్త ఉద్యోగుల వేతనం రూ.లక్షలోపు ఉండాలి. వారు కనీసం ఆరు నెలలు కొనసాగాలి. సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకం పాన్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలో ఆరు నెలలకు ఒకసారి జమ అవుతుంది.ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చుఅర్హ సంస్థలు అధికారిక ఈపీఎఫ్‌వో పీఎం-వీబీఆర్‌వై పోర్టల్ లేదా కార్మిక మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకోవచ్చు. యువతకు ఆర్థిక చేయూత, పరిశ్రమలకు నియామకాల ప్రోత్సాహం అందించడం ద్వారా ఉపాధి కల్పనను విస్తరించాలన్నది ఈ పథకం లక్ష్యం.మరింత చదవండి

Source link