ప్రభన్యూస్

Sonia Gandhi: సోనియా గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్నదెవరు? తెర వెనుక ఏం జరిగింది? |


Last Updated:

2004లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినా సోనియా గాంధీ ఎందుకు తిరస్కరించారు? తన కొత్త పుస్తకం Belonging: A Journey of Loveలో సోనియా గాంధీ వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Sonia Gandhi   (File pic/PTI)
Sonia Gandhi (File pic/PTI)

Sonia Gandhi Book: 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసిన అంశం సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం. అయితే ఈ నిర్ణయం ఆమె ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకున్నది కాదు. కొన్ని నెలల ముందే తన మనసులో మాటను పిల్లలు రాహుల్, ప్రియాంకకు చెప్పేశారు. ఈ విషయాలను తన కొత్త జ్ఞాపకాల పుస్తకం Belonging: A Journey of Loveలో వెల్లడించారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ బుక్‌ను ప్రచురిస్తుంది.

పిల్లలకు ముందే చెప్పిన నిర్ణయం

ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని అవుతారా అని పిల్లలు ప్రశ్నించగా.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవిని చేపట్టబోనని స్పష్టం చేసినట్లు సోనియా తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత కుటుంబం ఎదుర్కొన్న భయానక అనుభవాలే రాహుల్, ప్రియాంక అభ్యంతరానికి కారణం. ప్రధానమంత్రి పదవితో ప్రాణాలకు ముప్పు పెరుగుతుందని వారు భావించారు.

అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో నాయకత్వ వివాదం తలెత్తకూడదని ఆమె భావించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తికి పాలనా అనుభవం, నిజాయితీ ముఖ్యమని కూడా అభిప్రాయపడ్డారు.

కూటమి నేతల ఒత్తిడితో తాత్కాలిక అంగీకారం

2004లో యూపీఏ విజయం సాధించాక ప్రధాని పదవిపై చర్చ మళ్లీ మొదలైంది. పార్టీ కార్యకర్తలు, ఓటర్లు నిరాశ చెందుతారనే ఆలోచనతో సోనియా కొంత సందిగ్ధానికి గురయ్యారు. ఆమెను ఒప్పించేందుకు కూటమి నాయకులు నివాసానికి వచ్చి గంటకు పైగా మాట్లాడారు. చివరకు ఆమె చుట్టూ చేరి నిర్ణయం మార్చుకోవాలని పట్టుబట్టారు. ఒత్తిడికి గురైన సోనియా మెల్లగా ‘ఠీక్ హై’ అన్నారు. దీంతో ఆమె అంగీకరించారని భావించిన నేతలు అభినందనలు తెలిపారు.

ఈ ఘటనను గమనించిన ప్రియాంక వెంటనే రాహుల్‌కు విషయం చెప్పారు. తాను ప్రధాని కావాలనుకోవడం లేదని, నాయకులు ఒత్తిడి తెస్తున్నారని సోనియా పిల్లలకు వివరించారు. రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రియాంక మాత్రం ముందుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని తల్లికి సూచించారు.

ఇటలీ మూలాలు మరో కారణం

తన విదేశీ జన్మ అంశాన్ని బీజేపీ, మిత్రపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుని దేశంలో గందరగోళం సృష్టిస్తాయని సోనియా భావించారు. తాను ప్రేమించే దేశానికి నష్టం కలిగే అవకాశం ఉన్నప్పుడు ప్రధాని పదవిని ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించుకున్నారు. ఆ రాత్రి తీవ్రంగా ఆలోచించిన తర్వాత తన అంతరాత్మ మాట వినాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు రాహుల్‌కు తన నిర్ణయం మార్చుకోనని చెప్పారు. ఆయన కూడా అది సరైన నిర్ణయమని సమర్థించారు.

మన్మోహన్ సింగ్‌కు బాధ్యతలు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ నేతలు ఆమెను పదవి చేపట్టాలని కోరారు. అయితే ప్రధానమంత్రి స్థానం తన లక్ష్యం కాదని, దేశ లౌకిక పునాదులు, పేదల సంక్షేమం కోసం పనిచేయడమే తన ఆశయమని సోనియా స్పష్టం చేశారు. ప్రసంగ సమయంలో ఎంపీల నిరసనలతో అస్వస్థతకు గురై కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది.

తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని తేల్చిచెప్పిన ఆమె.. చివరకు మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. ఆయన 2004 నుంచి 2014 వరకు రెండు వరుస పర్యాయాలు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ పరిణామాలన్నింటినీ సోనియా తన పుస్తకంలో వ్యక్తిగత అనుభవాలుగా వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 4:19 pm Digital Edition : Prabhanews
Sonia Gandhi: సోనియా గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకున్నదెవరు? తెర వెనుక ఏం జరిగింది? |

Last Updated:Nov 10, 2026 1:12 PM IST2004లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినా సోనియా గాంధీ ఎందుకు తిరస్కరించారు? తన కొత్త పుస్తకం Belonging: A Journey of Loveలో సోనియా గాంధీ వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Sonia Gandhi (File pic/PTI)Sonia Gandhi Book: 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసిన అంశం సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం. అయితే ఈ నిర్ణయం ఆమె ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకున్నది కాదు. కొన్ని నెలల ముందే తన మనసులో మాటను పిల్లలు రాహుల్, ప్రియాంకకు చెప్పేశారు. ఈ విషయాలను తన కొత్త జ్ఞాపకాల పుస్తకం Belonging: A Journey of Loveలో వెల్లడించారు. హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ బుక్‌ను ప్రచురిస్తుంది.పిల్లలకు ముందే చెప్పిన నిర్ణయంఎన్నికలకు కొన్ని నెలల ముందు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ప్రధాని అవుతారా అని పిల్లలు ప్రశ్నించగా.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవిని చేపట్టబోనని స్పష్టం చేసినట్లు సోనియా తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల తర్వాత కుటుంబం ఎదుర్కొన్న భయానక అనుభవాలే రాహుల్, ప్రియాంక అభ్యంతరానికి కారణం. ప్రధానమంత్రి పదవితో ప్రాణాలకు ముప్పు పెరుగుతుందని వారు భావించారు.అయితే ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో నాయకత్వ వివాదం తలెత్తకూడదని ఆమె భావించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల వారసత్వాన్ని కొనసాగించే వ్యక్తికి పాలనా అనుభవం, నిజాయితీ ముఖ్యమని కూడా అభిప్రాయపడ్డారు.కూటమి నేతల ఒత్తిడితో తాత్కాలిక అంగీకారం2004లో యూపీఏ విజయం సాధించాక ప్రధాని పదవిపై చర్చ మళ్లీ మొదలైంది. పార్టీ కార్యకర్తలు, ఓటర్లు నిరాశ చెందుతారనే ఆలోచనతో సోనియా కొంత సందిగ్ధానికి గురయ్యారు. ఆమెను ఒప్పించేందుకు కూటమి నాయకులు నివాసానికి వచ్చి గంటకు పైగా మాట్లాడారు. చివరకు ఆమె చుట్టూ చేరి నిర్ణయం మార్చుకోవాలని పట్టుబట్టారు. ఒత్తిడికి గురైన సోనియా మెల్లగా 'ఠీక్ హై' అన్నారు. దీంతో ఆమె అంగీకరించారని భావించిన నేతలు అభినందనలు తెలిపారు.ఈ ఘటనను గమనించిన ప్రియాంక వెంటనే రాహుల్‌కు విషయం చెప్పారు. తాను ప్రధాని కావాలనుకోవడం లేదని, నాయకులు ఒత్తిడి తెస్తున్నారని సోనియా పిల్లలకు వివరించారు. రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రియాంక మాత్రం ముందుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండాలని తల్లికి సూచించారు.ఇటలీ మూలాలు మరో కారణంతన విదేశీ జన్మ అంశాన్ని బీజేపీ, మిత్రపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుని దేశంలో గందరగోళం సృష్టిస్తాయని సోనియా భావించారు. తాను ప్రేమించే దేశానికి నష్టం కలిగే అవకాశం ఉన్నప్పుడు ప్రధాని పదవిని ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించుకున్నారు. ఆ రాత్రి తీవ్రంగా ఆలోచించిన తర్వాత తన అంతరాత్మ మాట వినాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు రాహుల్‌కు తన నిర్ణయం మార్చుకోనని చెప్పారు. ఆయన కూడా అది సరైన నిర్ణయమని సమర్థించారు.మన్మోహన్ సింగ్‌కు బాధ్యతలుకాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ నేతలు ఆమెను పదవి చేపట్టాలని కోరారు. అయితే ప్రధానమంత్రి స్థానం తన లక్ష్యం కాదని, దేశ లౌకిక పునాదులు, పేదల సంక్షేమం కోసం పనిచేయడమే తన ఆశయమని సోనియా స్పష్టం చేశారు. ప్రసంగ సమయంలో ఎంపీల నిరసనలతో అస్వస్థతకు గురై కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది.తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని తేల్చిచెప్పిన ఆమె.. చివరకు మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. ఆయన 2004 నుంచి 2014 వరకు రెండు వరుస పర్యాయాలు యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ పరిణామాలన్నింటినీ సోనియా తన పుస్తకంలో వ్యక్తిగత అనుభవాలుగా వివరించారు.మరింత చదవండి

Source link