వృద్ధులు, అప్పుడే పుట్టిన చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు రాత్రి 10 గంటల తర్వాత అయినా ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా నిద్రపోనివ్వండి. తోటి మనుషుల పట్ల కొంచెం మానవత్వం, దయ చూపించండి. మీ ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేయకండి. పండుగ పేరుతో ఎదుటివారిని మానసికంగా హింసించడం సరైన పద్ధతి కాదు అని రేణు రాసుకొచ్చింది.

