Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
గురువారం ఉదయం 9:20 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.
MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,218 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.498 తగ్గింది. వెండి విషయానికి వస్తే MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,83,165 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,360 తగ్గింది.
ఫ్యూచర్స్ మార్కెట్లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లోనూ ధరలు భారీగా పడ్డాయి. ఉదయం 9:22 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,39,660కు చేరింది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే రూ.620 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,28,022గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ. 1,83, 740 వద్ద కొనసాగుతుంది. క్రితం ముగింపుతో రూ. 1,600 తగ్గింది.

