Last Updated:
అనిరుధ్-కావ్య పెళ్లి గ్రీస్ దేశంలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కోలీవుడ్ ‘రాక్‌స్టార్’, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్‌ల వివాహం నవంబర్ 11 న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రకృతి అందాలకు నెలవైన గ్రీస్ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ శుభకార్యం కన్నులపండువగా సాగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ఐపీఎల్ మ్యాచ్‌లలో గ్రౌండ్లో సందడి చేస్తూ ‘నేషనల్ క్రష్’గా పేరు తెచ్చుకున్న కావ్య మారన్, వరుస పాన్ ఇండియా హిట్లతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న అనిరుధ్‌ల పెళ్లి కోసం అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీస్‌లో జరిగిన ఈ అద్భుతమైన వేడుక తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వివాహ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అనిరుధ్‌కు సమీప బంధువైన (రజనీకాంత్ భార్య లతకు అనిరుధ్ మేనల్లుడు) రజనీకాంత్.. ఈ వేడుకకు హాజరై కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించారు. అంతేకాకుండా రజనీకాంత్, అనిరుధ్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘వేట్టయన్’ చిత్రంలోని ‘మనసిలాయో’ పాటకు రజనీకాంత్.. కావ్య మారన్, అనిరుధ్‌లతో కలిసి వేసిన మాస్ స్టెప్పులు ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచాయి. 75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ తనదైన ఎనర్జీతో, ట్రేడ్ మార్క్ స్టైల్‌తో డ్యాన్స్ చేసి అక్కడున్న అతిథులను ఆశ్చర్యపరిచారు. ఈ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
Thalaivar #Rajinikanth dance in Anirudh Kavya wedding
#Anirudh #anirudhwedding #Anirudh_Kavya_Wedding https://t.co/nXOiOZXVNW— Shakthi (@shakthispeaks) November 11, 2026
ఈ ప్రతిష్టాత్మక వివాహ వేడుకకు ఎం.కె. స్టాలిన్, కళానిధి మారన్ కుటుంబ సభ్యులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది రాజకీయ, వ్యాపార, సినీ రంగాల ప్రముఖులు హాజరై వధూవరులకు తమ ఆశీస్సులు అందించారు. విదేశంలో అత్యంత ప్రైవేట్‌గా, అట్టహాసంగా జరిగిన ఈ వివాహం అనంతరం.. నూతన దంపతుల తరఫున చెన్నైలో అత్యంత భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న ఈ గ్రాండ్ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు, క్రికెటర్లు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

