ప్రభన్యూస్

Paradox Harikatha: ఇక ముసుగు తీసి వస్తున్నా.. డిసెంబర్ 11న మసూద నటి అఖిల రామ్ కొత్త సినిమా | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కిరణ్, అఖిల రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా ‘పారడాక్స్ హరికథ’. డిసెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ రిలీజ్ చేశారు.

News18
News18

ఐరావత సినీ కలర్స్, అ‌గ్‌మైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ల పై కడ్లూరి అశోక్ , రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర నిర్మించిన చిత్రం ‘పారడాక్స్ హరికథ’. ఈ సినిమాకి అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్‌కే) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

మహవీర్ సంగీతం అందించిన ఈ సినిమాని డిసెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కేదార్ శంకర్ సినిమా విజువల్స్ చూశానని, హీరోహీరోయిన్లు బాగున్నారని అన్నారు. హిస్టారిక్‌లోని మూమెంట్‌ని తీసుకుని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ‘పారడాక్స్ హరికథ’ను తెరకెక్కించారని నటుడు అంబరీష్ అన్నారు.

‘‘పారడాక్స్ హరికథ’ సాంగ్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా నిర్మాతలకు థాంక్స్. ఈ హరికథ సినిమా వినూత్నమైన సినిమా అని, తెలుగు చిన్న చిత్రాల హిట్ జాబితాలో ఈ సినిమా కచ్చితంగా చేరుతుందని, తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు రాని ఒక కొత్త తరహ అంశం ఉందన్ని , అది ప్రేక్షకులకు కొత్త తరహ అనుభూతి ఇస్తుందని తెలుపుతూ డిసెంబర్ 11న రిలీజ్ అవుతున్న సినిమాను ప్రజలందరూ ఆదరించాలని కోరారు దర్శకుడు అనుదీప్ రెడ్డి. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం అని, అన్ని రకాల హంగులతో రాబోతోన్న ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత అశోక్ కడ్లూరి తెలిపారు.

ఇకపోతే ‘‘పారడాక్స్ హరికథ’ కోసం టీం అంతా కలిసి ఎంతో కష్టపడ్డాం అని తెలిపిన లావణ్య రెడ్డి, మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాం. రిలీజ్ విషయంలో మేం సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ‘హరికథ’లో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ‘‘పారడాక్స్ హరికథ’ జర్నీలో అనుదీప్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. కథ విన్న వెంటనే నాకు ఎంతో నచ్చింది. ఇలాంటి కథ రావాలని ప్రతీ ఒక్క యాక్టర్ అనుకుంటారు’ అని నటుడు కిరణ్ అన్నారు. ‘మసూద’లో నన్ను ముసుగులో చూసి ఉంటారు. ఇప్పుడు ముసుగు తీసి వస్తున్నాను. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అఖిల రామ్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 3:50 pm Digital Edition : Prabhanews
Paradox Harikatha: ఇక ముసుగు తీసి వస్తున్నా.. డిసెంబర్ 11న మసూద నటి అఖిల రామ్ కొత్త సినిమా | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 13, 2026 3:48 PM ISTకిరణ్, అఖిల రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా ‘పారడాక్స్ హరికథ’. డిసెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ రిలీజ్ చేశారు. News18ఐరావత సినీ కలర్స్, అ‌గ్‌మైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ల పై కడ్లూరి అశోక్ , రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర నిర్మించిన చిత్రం ‘పారడాక్స్ హరికథ’. ఈ సినిమాకి అనుదీప్ రెడ్డి కొతూరు (ఏఆర్‌కే) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కిరణ్, రంజిత్, అఖిల రామ్, లావణ్య రెడ్డి, కీర్తి, మన్యం భాస్కర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.మహవీర్ సంగీతం అందించిన ఈ సినిమాని డిసెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘గుప్పెడంత ప్రేమ’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కేదార్ శంకర్ సినిమా విజువల్స్ చూశానని, హీరోహీరోయిన్లు బాగున్నారని అన్నారు. హిస్టారిక్‌లోని మూమెంట్‌ని తీసుకుని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ‘పారడాక్స్ హరికథ’ను తెరకెక్కించారని నటుడు అంబరీష్ అన్నారు.‘‘పారడాక్స్ హరికథ’ సాంగ్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన నా నిర్మాతలకు థాంక్స్. ఈ హరికథ సినిమా వినూత్నమైన సినిమా అని, తెలుగు చిన్న చిత్రాల హిట్ జాబితాలో ఈ సినిమా కచ్చితంగా చేరుతుందని, తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు రాని ఒక కొత్త తరహ అంశం ఉందన్ని , అది ప్రేక్షకులకు కొత్త తరహ అనుభూతి ఇస్తుందని తెలుపుతూ డిసెంబర్ 11న రిలీజ్ అవుతున్న సినిమాను ప్రజలందరూ ఆదరించాలని కోరారు దర్శకుడు అనుదీప్ రెడ్డి. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం అని, అన్ని రకాల హంగులతో రాబోతోన్న ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత అశోక్ కడ్లూరి తెలిపారు.ఇకపోతే ‘‘పారడాక్స్ హరికథ’ కోసం టీం అంతా కలిసి ఎంతో కష్టపడ్డాం అని తెలిపిన లావణ్య రెడ్డి, మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాం. రిలీజ్ విషయంలో మేం సవాళ్లు ఎదుర్కొంటున్నాం. ‘హరికథ’లో అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మాకు మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ‘‘పారడాక్స్ హరికథ’ జర్నీలో అనుదీప్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. కథ విన్న వెంటనే నాకు ఎంతో నచ్చింది. ఇలాంటి కథ రావాలని ప్రతీ ఒక్క యాక్టర్ అనుకుంటారు’ అని నటుడు కిరణ్ అన్నారు. 'మసూద’లో నన్ను ముసుగులో చూసి ఉంటారు. ఇప్పుడు ముసుగు తీసి వస్తున్నాను. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అఖిల రామ్ తెలిపారు.మరింత చదవండి

Source link