ప్రభన్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్… రద్దైన ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయ్! | బిజినెస్


Last Updated:

రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో రద్దు చేసిన పలు రైళ్లను తిరిగి ప్రారంభించడంతో పాటు, ఆలస్యంగా నడుస్తున్న మరికొన్ని రైళ్లను ఇకపై సాధారణ సమయాల్లోనే నడపనుంది. నవంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... రద్దైన ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయ్! (ప్రతీకాత్మక చిత్రం)
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్… రద్దైన ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయ్! (ప్రతీకాత్మక చిత్రం)

రైలులో ప్రయాణించే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మేడ్చల్ – ఆకనాపేట మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గతంలో రద్దు చేసిన కొన్ని రైళ్లను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆలస్యంగా నడుస్తున్న మరికొన్ని రైళ్లను కూడా ఇకపై యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. మనోహరాబాద్ యార్డులో అదనపు రైల్వే లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టారు. ఈ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారు. తాజాగా ఈ పనులు పూర్తవడంతో ప్రభావితమైన రైళ్లను తిరిగి సాధారణ షెడ్యూల్ ప్రకారం నడపాలని నిర్ణయించింది.

కాచిగూడ – నిజామాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 77601, నిజామాబాద్ – కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్ 77602లను తిరిగి పునరుద్ధరించారు. ఈ రైళ్లు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 22, 2026 వరకు యథావిధిగా నడుస్తాయి. అలాగే, సికింద్రాబాద్ – సిద్ధిపేట మధ్య నడిచే రైలు నంబర్లు 77653, 77655లను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సిద్ధిపేట – సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబర్లు 77654, 77656 కూడా మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ నాలుగు రైళ్లు నవంబర్ 16 నుంచి నవంబర్ 22, 2026 వరకు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. ఇక కాచిగూడ – మెదక్ మధ్య నడిచే రైలు నంబర్ 57301, మెదక్ – కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్ 57302లను కూడా ఇదే సమయంలో పునరుద్ధరించారు. ఈ రైళ్లు కూడా నవంబర్ 16 నుంచి నవంబర్ 22 వరకు ఎలాంటి మార్పులు లేకుండా సాధారణ సమయాల్లోనే నడుస్తాయి.

ఇది కూడా చదవండి: Ration Card: మీ రేషన్ కార్డుతో ఈ పనులు చేయొచ్చు… మేరా రేషన్ యాప్‌లో ఎన్నో ఉపయోగకరమైన సేవలు!

గతంలో ప్రయాణ సమయాల్లో మార్పులు చేసిన మరో నాలుగు రైళ్లను కూడా ఇకపై నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ముంబై సీఎస్‌టీ – లింగంపల్లి మధ్య నడిచే రైలు నంబర్ 17057 గతంలో 60 నిమిషాలు ఆలస్యంగా నడిచేది. ఈ రైలు నవంబర్ 15 నుంచి 21, 2026 వరకు సాధారణ షెడ్యూల్ ప్రకారమే నడుస్తుంది. భగత్ కీ కోఠి – కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్ 17606 గతంలో 75 నిమిషాలు ఆలస్యంగా నడిచేది. ఈ రైలు నవంబర్ 14 నుంచి నవంబర్ 20, 2026 వరకు నిర్ణీత సమయాల ప్రకారం నడుస్తుంది. అలాగే, లింగంపల్లి – ముంబై సీఎస్‌టీ మధ్య నడిచే రైలు నంబర్ 17058, కాచిగూడ – పూర్ణ మధ్య నడిచే రైలు నంబర్ 77605 గతంలో ఒక్కొక్కటి 60 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచేవి. ఈ రెండు రైళ్లు నవంబర్ 16 నుంచి నవంబర్ 22, 2026 వరకు సాధారణ సమయాల ప్రకారం నడుస్తాయి.

రైళ్ల పునరుద్ధరణ, సమయాల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణానికి ముందుగానే తమ రైలు షెడ్యూల్‌ను చూసుకుని తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు. మొత్తంగా, మేడ్చల్ – ఆకనాపేట మధ్య రైల్వే పనుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది. రద్దయిన రైళ్లు తిరిగి అందుబాటులోకి రావడంతో పాటు, ఆలస్యంగా నడిచే రైళ్లు కూడా సాధారణ సమయాలకు చేరుకోనున్నాయి. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి సంబంధించిన రైలు వివరాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 3:46 pm Digital Edition : Prabhanews
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్… రద్దైన ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయ్! | బిజినెస్

Last Updated:Nov 13, 2026 3:40 PM ISTరైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో రద్దు చేసిన పలు రైళ్లను తిరిగి ప్రారంభించడంతో పాటు, ఆలస్యంగా నడుస్తున్న మరికొన్ని రైళ్లను ఇకపై సాధారణ సమయాల్లోనే నడపనుంది. నవంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పుల పూర్తి వివరాలు తెలుసుకుందాం.రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... రద్దైన ఈ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయ్! (ప్రతీకాత్మక చిత్రం)రైలులో ప్రయాణించే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని మేడ్చల్ - ఆకనాపేట మధ్య రైల్వే డబ్లింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో గతంలో రద్దు చేసిన కొన్ని రైళ్లను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆలస్యంగా నడుస్తున్న మరికొన్ని రైళ్లను కూడా ఇకపై యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. మనోహరాబాద్ యార్డులో అదనపు రైల్వే లైన్ ఏర్పాటు కోసం నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు చేపట్టారు. ఈ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారు. తాజాగా ఈ పనులు పూర్తవడంతో ప్రభావితమైన రైళ్లను తిరిగి సాధారణ షెడ్యూల్ ప్రకారం నడపాలని నిర్ణయించింది.కాచిగూడ - నిజామాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 77601, నిజామాబాద్ - కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్ 77602లను తిరిగి పునరుద్ధరించారు. ఈ రైళ్లు అక్టోబర్ 17 నుంచి నవంబర్ 22, 2026 వరకు యథావిధిగా నడుస్తాయి. అలాగే, సికింద్రాబాద్ - సిద్ధిపేట మధ్య నడిచే రైలు నంబర్లు 77653, 77655లను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సిద్ధిపేట - సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబర్లు 77654, 77656 కూడా మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఈ నాలుగు రైళ్లు నవంబర్ 16 నుంచి నవంబర్ 22, 2026 వరకు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయి. ఇక కాచిగూడ - మెదక్ మధ్య నడిచే రైలు నంబర్ 57301, మెదక్ - కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్ 57302లను కూడా ఇదే సమయంలో పునరుద్ధరించారు. ఈ రైళ్లు కూడా నవంబర్ 16 నుంచి నవంబర్ 22 వరకు ఎలాంటి మార్పులు లేకుండా సాధారణ సమయాల్లోనే నడుస్తాయి.ఇది కూడా చదవండి: Ration Card: మీ రేషన్ కార్డుతో ఈ పనులు చేయొచ్చు... మేరా రేషన్ యాప్‌లో ఎన్నో ఉపయోగకరమైన సేవలు!గతంలో ప్రయాణ సమయాల్లో మార్పులు చేసిన మరో నాలుగు రైళ్లను కూడా ఇకపై నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ముంబై సీఎస్‌టీ - లింగంపల్లి మధ్య నడిచే రైలు నంబర్ 17057 గతంలో 60 నిమిషాలు ఆలస్యంగా నడిచేది. ఈ రైలు నవంబర్ 15 నుంచి 21, 2026 వరకు సాధారణ షెడ్యూల్ ప్రకారమే నడుస్తుంది. భగత్ కీ కోఠి - కాచిగూడ మధ్య నడిచే రైలు నంబర్ 17606 గతంలో 75 నిమిషాలు ఆలస్యంగా నడిచేది. ఈ రైలు నవంబర్ 14 నుంచి నవంబర్ 20, 2026 వరకు నిర్ణీత సమయాల ప్రకారం నడుస్తుంది. అలాగే, లింగంపల్లి - ముంబై సీఎస్‌టీ మధ్య నడిచే రైలు నంబర్ 17058, కాచిగూడ - పూర్ణ మధ్య నడిచే రైలు నంబర్ 77605 గతంలో ఒక్కొక్కటి 60 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచేవి. ఈ రెండు రైళ్లు నవంబర్ 16 నుంచి నవంబర్ 22, 2026 వరకు సాధారణ సమయాల ప్రకారం నడుస్తాయి.రైళ్ల పునరుద్ధరణ, సమయాల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణానికి ముందుగానే తమ రైలు షెడ్యూల్‌ను చూసుకుని తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరారు. మొత్తంగా, మేడ్చల్ - ఆకనాపేట మధ్య రైల్వే పనుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఈ నిర్ణయంతో ఊరట లభించనుంది. రద్దయిన రైళ్లు తిరిగి అందుబాటులోకి రావడంతో పాటు, ఆలస్యంగా నడిచే రైళ్లు కూడా సాధారణ సమయాలకు చేరుకోనున్నాయి. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి సంబంధించిన రైలు వివరాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.మరింత చదవండి

Source link