ప్రభన్యూస్

Egg omelette: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా?.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే స్పాంజిలా మెత్తగా వస్తుంది! | లైఫ్ స్టైల్


Last Updated:

పెనానికి అంటుకుపోవడం, సరిగ్గా పొంగకపోవడం, గట్టిగా మారిపోవడం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా నాన్‌స్టిక్ పాన్‌లో కూడా ఆమ్లెట్ అంటుకుంటే చిరాకు వస్తుంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఆమ్లెట్ మెత్తగా, రుచిగా రావడానికి ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా కొన్ని వంట చిట్కాలను సూచించారు.

News18
News18

గుడ్డు ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనైనా, సాయంత్రం స్నాక్స్‌గానైనా వేడి వేడి ఆమ్లెట్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. గుడ్లలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు వేసి సులభంగా ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. అయితే ఆమ్లెట్ చేసేటప్పుడు కొందరికి ఒక సమస్య ఎదురవుతుంది. పెనానికి అంటుకుపోవడం, సరిగ్గా పొంగకపోవడం, గట్టిగా మారిపోవడం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా నాన్‌స్టిక్ పాన్‌లో కూడా ఆమ్లెట్ అంటుకుంటే చిరాకు వస్తుంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఆమ్లెట్ మెత్తగా, రుచిగా రావడానికి ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా కొన్ని వంట చిట్కాలను సూచించారు.

పెనంపై కొద్దిగా ఉప్పు చల్లండి: ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా ఉండేందుకు ఒక చిన్న చిట్కా ఉపయోగపడుతుంది. ముందుగా పెనాన్ని వేడి చేసి, అందులో కొద్దిగా ఉప్పు చల్లాలి. ఆ తర్వాత అదనపు ఉప్పును తొలగించి, కొద్దిగా నూనె లేదా వెన్న వేసుకోవాలి. అయితే ఉప్పు చల్లడం వల్ల అన్ని రకాల పెనాల్లో ఆమ్లెట్ అంటుకోకుండా ఉంటుందని చెప్పలేం. పాన్ ఉపరితలం, దాని వేడి కూడా ముఖ్యమే. కాబట్టి ఈ చిట్కాను జాగ్రత్తగా ప్రయత్నించండి.

మంటను అదుపులో ఉంచండి: ఆమ్లెట్ బాగా రావాలంటే మంట విషయంలో జాగ్రత్త అవసరం. మంట ఎక్కువగా ఉంటే గుడ్డు అడుగుభాగం త్వరగా మాడిపోతుంది. దీంతో ఆమ్లెట్ పెనానికి అంటుకోవడంతో పాటు లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. అందుకే గుడ్డు మిశ్రమాన్ని పోసే ముందు మంటను మధ్యస్థ స్థాయికి లేదా తక్కువకు తగ్గించాలి. నిదానంగా ఉడికించడం వల్ల ఆమ్లెట్ మెత్తగా వస్తుంది.

గుడ్డు మిశ్రమాన్ని బాగా గిలకొట్టండి: ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా, మెత్తగా రావాలంటే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన పూర్తిగా కలిసేలా బాగా గిలకొట్టాలి. కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు గిలకొడితే మిశ్రమంలోకి గాలి చేరి ఆమ్లెట్ కాస్త పొంగినట్లు వస్తుంది. కావాలనుకుంటే కొద్దిగా పాలు లేదా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. అయితే ఎక్కువగా కలపకూడదు.

వండేటప్పుడు మూత పెట్టండి: గుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోసిన తర్వాత మంటను తగ్గించి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల వేడి ఆవిరి సహాయంతో ఆమ్లెట్ పైభాగం కూడా నెమ్మదిగా ఉడుకుతుంది. దీంతో పదేపదే తిప్పాల్సిన అవసరం ఉండదు. ఆమ్లెట్ అంచులు గట్టిపడి, పెనం నుంచి విడిపోవడం మొదలైనప్పుడు జాగ్రత్తగా తిప్పాలి.

మంచి పాన్ ఎంచుకోవడం కూడా ముఖ్యం: ఆమ్లెట్ తయారీకి నాణ్యమైన నాన్‌స్టిక్ పాన్ ఉపయోగించడం సులభం. స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాన్ వాడితే ముందుగా దానిని వేడి చేసి, కొద్దిగా నూనె లేదా వెన్నను ఉపరితలమంతా సమానంగా రాయాలి. గుడ్డు మిశ్రమాన్ని పోసిన వెంటనే గరిటెతో కదపకూడదు. అంచులు ఉడికిన తర్వాత మాత్రమే నెమ్మదిగా తిప్పాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పెనానికి అంటుకోకుండా, బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రుచికరమైన ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 9:10 am Digital Edition : Prabhanews
Egg omelette: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా?.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే స్పాంజిలా మెత్తగా వస్తుంది! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 12, 2026 9:04 AM ISTపెనానికి అంటుకుపోవడం, సరిగ్గా పొంగకపోవడం, గట్టిగా మారిపోవడం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా నాన్‌స్టిక్ పాన్‌లో కూడా ఆమ్లెట్ అంటుకుంటే చిరాకు వస్తుంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఆమ్లెట్ మెత్తగా, రుచిగా రావడానికి ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా కొన్ని వంట చిట్కాలను సూచించారు.News18గుడ్డు ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనైనా, సాయంత్రం స్నాక్స్‌గానైనా వేడి వేడి ఆమ్లెట్ తినడానికి చాలామంది ఇష్టపడతారు. గుడ్లలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు వేసి సులభంగా ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. అయితే ఆమ్లెట్ చేసేటప్పుడు కొందరికి ఒక సమస్య ఎదురవుతుంది. పెనానికి అంటుకుపోవడం, సరిగ్గా పొంగకపోవడం, గట్టిగా మారిపోవడం వంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా నాన్‌స్టిక్ పాన్‌లో కూడా ఆమ్లెట్ అంటుకుంటే చిరాకు వస్తుంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఆమ్లెట్ మెత్తగా, రుచిగా రావడానికి ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా కొన్ని వంట చిట్కాలను సూచించారు.పెనంపై కొద్దిగా ఉప్పు చల్లండి: ఆమ్లెట్ పెనానికి అంటుకోకుండా ఉండేందుకు ఒక చిన్న చిట్కా ఉపయోగపడుతుంది. ముందుగా పెనాన్ని వేడి చేసి, అందులో కొద్దిగా ఉప్పు చల్లాలి. ఆ తర్వాత అదనపు ఉప్పును తొలగించి, కొద్దిగా నూనె లేదా వెన్న వేసుకోవాలి. అయితే ఉప్పు చల్లడం వల్ల అన్ని రకాల పెనాల్లో ఆమ్లెట్ అంటుకోకుండా ఉంటుందని చెప్పలేం. పాన్ ఉపరితలం, దాని వేడి కూడా ముఖ్యమే. కాబట్టి ఈ చిట్కాను జాగ్రత్తగా ప్రయత్నించండి.మంటను అదుపులో ఉంచండి: ఆమ్లెట్ బాగా రావాలంటే మంట విషయంలో జాగ్రత్త అవసరం. మంట ఎక్కువగా ఉంటే గుడ్డు అడుగుభాగం త్వరగా మాడిపోతుంది. దీంతో ఆమ్లెట్ పెనానికి అంటుకోవడంతో పాటు లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. అందుకే గుడ్డు మిశ్రమాన్ని పోసే ముందు మంటను మధ్యస్థ స్థాయికి లేదా తక్కువకు తగ్గించాలి. నిదానంగా ఉడికించడం వల్ల ఆమ్లెట్ మెత్తగా వస్తుంది.గుడ్డు మిశ్రమాన్ని బాగా గిలకొట్టండి: ఆమ్లెట్ ఫ్లఫ్ఫీగా, మెత్తగా రావాలంటే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన పూర్తిగా కలిసేలా బాగా గిలకొట్టాలి. కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు గిలకొడితే మిశ్రమంలోకి గాలి చేరి ఆమ్లెట్ కాస్త పొంగినట్లు వస్తుంది. కావాలనుకుంటే కొద్దిగా పాలు లేదా నీళ్లు కూడా కలుపుకోవచ్చు. అయితే ఎక్కువగా కలపకూడదు.వండేటప్పుడు మూత పెట్టండి: గుడ్డు మిశ్రమాన్ని పెనంపై పోసిన తర్వాత మంటను తగ్గించి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల వేడి ఆవిరి సహాయంతో ఆమ్లెట్ పైభాగం కూడా నెమ్మదిగా ఉడుకుతుంది. దీంతో పదేపదే తిప్పాల్సిన అవసరం ఉండదు. ఆమ్లెట్ అంచులు గట్టిపడి, పెనం నుంచి విడిపోవడం మొదలైనప్పుడు జాగ్రత్తగా తిప్పాలి.మంచి పాన్ ఎంచుకోవడం కూడా ముఖ్యం: ఆమ్లెట్ తయారీకి నాణ్యమైన నాన్‌స్టిక్ పాన్ ఉపయోగించడం సులభం. స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాన్ వాడితే ముందుగా దానిని వేడి చేసి, కొద్దిగా నూనె లేదా వెన్నను ఉపరితలమంతా సమానంగా రాయాలి. గుడ్డు మిశ్రమాన్ని పోసిన వెంటనే గరిటెతో కదపకూడదు. అంచులు ఉడికిన తర్వాత మాత్రమే నెమ్మదిగా తిప్పాలి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పెనానికి అంటుకోకుండా, బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రుచికరమైన ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు.మరింత చదవండి

Source link