ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ తొక్కలను కొద్దిగా ఉడికించాలి లేదా ఆవిరిపై మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి పూర్తిగా చల్లార్చి, అందులోని నీటిని చేతులతో బాగా పిండేయాలి. తొక్కల్లో తేమ ఎక్కువగా ఉంటే మిశ్రమం గట్టిగా తయారుకాదు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన తొక్కలు, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముద్ద, మసాలా దినుసులన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గట్టిగా పిండిలా తయారు చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

