Last Updated:
Rent a Cab New Rules: క్యాబ్ బిజినెస్ చేయాలనుకునే వారికి కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒకప్పుడు చేతిలో కోట్ల రూపాయలు ఉంటే తప్ప చేయలేని ఈ బిజినెస్ ఇప్పుడు కేవలం రూ.10 లక్షలు ఉన్నాసరే మొదలుపెట్టవచ్చు. ఎలా అంటే?
కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? చేతిలో పెద్దగా పెట్టుబడి లేకపోయినా సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు క్యాబ్ అద్దె వ్యాపారం ప్రారంభించాలంటే కనీసం 50 కార్లు ఉండాలనే రూల్ ఉండేది. దీంతో లక్షలు కాదు.. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగలిగే వారికే ఈ రంగంలో బిజిసెన్ స్టార్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు ఈ నిబంధనలను మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 50 కార్లకు బదులు 5 కార్లు ఉంటే చాలా వ్యాపారం మొదలు పెట్టవచ్చిన కేంద్రం నిర్ణయించిందిత. దీంతో సుమారు రూ.10 లక్షల పెట్టుబడితోనే క్యాబ్ వ్యాపారం ప్రారంభించే అవకాశం ఏర్పడనుంది. ముఖ్యంగా ఐదు సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసి సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారవచ్చు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త ‘రెంట్ ఎ క్యాబ్’ సంస్కరణల్లో ఈ కీలక మార్పు ఉంది. ఇప్పటివరకు క్యాబ్ ఆపరేటర్లు కనీసం 50 వాహనాలు కలిగి ఉండాలనే నిబంధన ఉండగా, దాన్ని ఐదు వాహనాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రతి కార్యకలాపాల ప్రదేశంలో కనీసం రెండు క్యాబ్‌లు ఉండాలి. ఈ మార్పు అమల్లోకి వస్తే చిన్న వ్యాపారులు కూడా పెద్ద సంస్థలతో పాటు క్యాబ్ సేవల రంగంలోకి ప్రవేశించవచ్చు. కొత్త కార్లు కొనలేని వారు మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అయితే వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్, ఫిట్‌నెస్, బీమా వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
ఉదాహరణకు ఒక్కో సెకండ్ హ్యాండ్ కారును రూ.2 లక్షల లోపు కొనుగోలు చేస్తే 5 కార్లకు దాదాపు రూ.9-9.5 లక్షలు అవసరమవుతాయి. అయితే ఇది కేవలం వాహనాల కొనుగోలుకు సంబంధించిన అంచనా మాత్రమే. కార్ల కండిషన్, మోడల్, వయసును బట్టి ధరలు మారుతాయి. బీమా, రిజిస్ట్రేషన్, అవసరమైన అనుమతులు, మరమ్మతులు, నిర్వహణ, డ్రైవర్ల ఖర్చులకు అదనపు బడ్జెట్ అవసరం. కాబట్టి వ్యాపారం ప్రారంభించే ముందు మొత్తం పెట్టుబడిని లెక్కించుకోవాలి.
క్యాబ్‌లలో లొకేషన్ ట్రాకింగ్, ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరి చేయడంతో పాటు 24 గంటల ఫిర్యాదుల సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రైవర్లకు పోలీస్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరి కానుంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే తక్కువ పెట్టుబడితో క్యాబ్ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. అయితే ప్రస్తుతం ఇవి కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మాత్రమే. తుది నిబంధనలు, అమలు తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

