జీర్ణ సమస్యలు ఉన్నవారు: ఉసిరిలో విటమిన్ సి, పుల్లటి రుచి కలిగించే సహజ పదార్థాలు ఉంటాయి. కొందరికి ఇది ఎలాంటి ఇబ్బంది కలిగించకపోయినా, ఇప్పటికే అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారికి అసౌకర్యం కలగవచ్చు. ఉసిరి తిన్న తర్వాత ఛాతిలో మంట, కడుపునొప్పి లేదా ఉబ్బరం పెరిగితే దాని వాడకాన్ని తగ్గించి వైద్యులను సంప్రదించాలి.

