నిజానికి.. బాలు సినిమా తెలుగులో మహేష్ ఆనంద్ నటించిన లాస్ట్ మూవీ. అంతకు ముందు నుంచే టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించాడు కానీ.. 90స్ కిడ్స్‌కు మాత్రం బాలు సినిమా పేరు చెబితే గుర్తుపట్టేస్తారు. 1989లో వచ్చిన లంకేశ్వరుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ ఆనంద్. ఆ తర్వాత SP పరుశురాం, టాప్ హీరో, బొబ్బిలి సింహం, అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, ఆటో డ్రైవర్.. ఇలా చాలా సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించాడు.

