Last Updated:
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా ఇరుముడి హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తన ప్రియుడిని పెళ్లాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా తారలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరగ్గా, టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మరోవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ వ్యాపారవేత్త కావ్యా మారన్‌ను గ్రీస్ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి ఆసక్తికర వాతావరణంలో, ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ నటి ప్రియా భవానీ శంకర్ తన అభిమానులకు ఓ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
తమిళ, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్, తన దీర్ఘకాలిక ప్రియుడు రాజ్ వేల్‌ను బుధవారం వివాహం చేసుకున్నారు. చెన్నై నగరంలో ఉదయం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చాలా సింపుల్ గా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఎలాంటి ఆర్భాటాలు, హడావిడి లేకుండా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు నెట్టింట శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Wedding bells for #PriyaBhavaniShankar and #RajvelRaj! ❤️💍 The lovely couple begins a beautiful new chapter together. Wishing them a lifetime of love, happiness and togetherness! ✨❤️ https://t.co/OrekadfDYd
— ????????????????????????????????????🦋 (@buttu_iam27) November 11, 2026
ప్రియా భవానీ శంకర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె తన కాలేజీ రోజుల్లోనే రాజ్ వేల్‌తో ప్రేమలో పడ్డారు. గత పదేళ్లుగా వీరిద్దరూ గాఢమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. క్లాస్‌మేట్స్ గా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. తమ ప్రేమ విషయాన్ని ప్రియా గతంలోనే పలు ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా పోస్టుల ద్వారా బహిరంగంగానే వెల్లడించారు. ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో ఈ పదేళ్ల ప్రేమకథకు పెళ్లితో అందమైన ముగింపు పలికారు.
తమిళనాడుకు చెందిన ప్రియా తొలుత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ లో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందారు. అక్కడి నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన ఈ బ్యూటీ.. తమిళంలో పలు మిడ్-రేంజ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో సంతోష్ శోభన్ తో ‘కళ్యాణం కమనీయం’, గోపీచంద్ సరసన ‘భీమా’, సత్యదేవ్ ‘జీబ్రా’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అవి కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేదు. అయితే, ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన ‘ఇరుముడి’ సినిమాతో ఆమె కెరీర్ లోనే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాల ఉత్సాహంలోనే ఆమె తన కొత్త జీవితాన్ని ప్రారంభించడం విశేషం.

