ముదిగుబ్బలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాన్స్‌జెండర్ శాంతి మృతి
ప్రభ న్యూస్ , సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ జులై 29:
ముదిగుబ్బ మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టడంతో ట్రాన్స్‌జెండర్ శాంతి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఐచర్ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

