అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంభ ఊర్వశి మేనక’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా’ అంటూ క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చైతన్య భరద్వాజ్ స్వర పరిచిన ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. రామ్ మిర్యాల ఆలపించాడు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదల కాబోతుంది.
Source link
Allari Naresh: 'రంభ ఊర్వశి మేనక' మూవీ సెకండ్ సింగల్ రిలీజ్..!
