ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం బంగారం ధరలు ఎక్కువగా ఉండటమేనని ఇక్రా పేర్కొంది. అయితే రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం పరిమాణం మాత్రం అదే స్థాయిలో పెరగలేదని స్పష్టం చేసింది. 2021-22 నుంచి 2025-26 మధ్య పెద్ద సంస్థల గోల్డ్ లోన్ బుక్ 24 శాతం పెరిగినా, తాకట్టుగా ఉంచిన బంగారు నగల పరిమాణం మాత్రం కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే పెరిగిందని నివేదిక వెల్లడించింది. మొత్తంగా చూస్తే, బంగారం ధరలు పెరగడం, గోల్డ్ లోన్లకు పెరుగుతున్న డిమాండ్, రుణదాతల విస్తరణ ప్రణాళికలు కలిసి ఈ రంగాన్ని వచ్చే కొన్నేళ్లలో మరింత పెద్దదిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పోటీ కూడా పెరుగుతున్నందున, ముఖ్యంగా ఎన్బీఎఫ్సీలు తమ లాభదాయకతను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఈ నివేదిక సూచిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)

