ప్రభన్యూస్

నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో 10 వేలకుపైగా పోస్టుల భర్తీ.

ప్రభ న్యూస్, అమరావతి, జూలై 30:

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,060 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ నుంచి దశలవారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రుల బృందం, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తొలి దశలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.రెండో దశలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న, మూడో దశలో 2,388 పోస్టులకు, నాలుగో దశలో 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులకు సూచించారు.మూడో దశలో భర్తీ చేయనున్న పోస్టుల్లో 2,225 పోస్టులు హోంశాఖకు సంబంధించినవిగా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం ఖాళీల వివరాలను ఆగస్టు 6న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 1:42 pm Digital Edition : Prabhanews
<b>నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో 10 వేలకుపైగా పోస్టుల భర్తీ.