ప్రభన్యూస్

7 August, 2026 08:14

[title పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు]

పిల్లల సంక్షేమం, ఆహార భద్రతలో రాజీకి తావులేదు

లోపాల సవరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి

ఏపీ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు

ప్రభ న్యూస్ విజయనగరం ఆగస్టు 6

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు బుధవారం విజయనగరం జిల్లాలోని గరివిడి మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం, కేజీబీవీ, జెడ్పీ హైస్కూల్, రెండు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసి సంబంధిత రికార్డులను పరిశీలించి విద్యార్థులు, లబ్ధిదారులతో మాట్లాడారు.మొదట గరివిడి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన విద్యుత్ మరమ్మతులు పూర్తి చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే క్యారెట్ నిల్వలను సక్రమంగా నిర్వహించకపోవడం గమనించి, వెంటనే సరిచేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం కేజీబీవీ గరివిడిని సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు. వారికి అందుతున్న ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. పరిశీలనలో గుడ్ల పంపిణీ వివరాలు చెక్కు రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడం, అరటి పండ్లు బరువు నిర్దేశిత 100 గ్రాములకు బదులుగా సుమారు 80 గ్రాములుగా ఉండటం గమనించి, వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.తదుపరి బొండపల్లి జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. డి బండపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోసం కేటాయించిన 6 కిలోల కందిపప్పులో కేవలం 3 కిలోలే నిల్వ ఉండటాన్ని గుర్తించి దీనిపై జిల్లా విద్యాశాఖాధికారిని ఫోన్‌లో సంప్రదించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే గరివిడిలోని రెండు చౌక ధరల దుకాణాలను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ సభ్యుడు, ఫెయిర్ ప్రైస్ షాపుల అధికార ధ్రువీకరణ పునరుద్ధరణ సర్టిఫికెట్లు గడువు ముగిసినా రెన్యువల్ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దుకాణంలో 45 కిలోల బియ్యాన్ని ఒకే ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయడం గమనించి నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైన మెమోలు జారీ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలులో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులు, చిన్నారులకు అందించే ఆహారంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని బి. కాంతారావు స్పష్టం చేశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు, ఐసీడీఎస్ అధికారులు, సంబంధిత శాఖలా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 8:14 am Digital Edition : Prabhanews