తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం.. ఈ పంట వేస్తే రైతుల జేబులు నిండటం ఖాయమంటున్న శాస్త్రవేత్తలు! |


Last Updated:

చిత్తూరు జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా ఆముదం సాగు చేపట్టాలని వ్యవసాయ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు.

News18
News18

రైతులు ప్రతి ఏడాది ఒకే రకమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగుకు ప్రత్యామ్నాయంగా ఆముదం పంటను సాగు చేయడం ప్రయోజనకరమని జిల్లా ఏరువాక కేంద్రం చిత్తూరు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ. బాలహుస్సేయిన్ రెడ్డి తెలిపారు. లోకల్18 ద్వారా రైతులకు ఈ పంట సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులపై వివరించారు.

బైరెడ్డిపల్లి మండలం కడపనతం గ్రామంలో జాతీయ నూనెగింజల మిషన్‌లో భాగంగా ఆముదం సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బాలహుస్సేయిన్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో అడవి పందుల బెడద కారణంగా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆముదం సాగును ఎంచుకోవచ్చని సూచించారు. ఆముదం పంటకు అడవి పందుల సమస్య తక్కువగా ఉంటుందని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చని వివరించారు.

విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలి?

ఆముదం సాగుకు ఎకరాకు సుమారు రెండు కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేసిన తర్వాతే పొలంలో నాటుకోవాలని శాస్త్రవేత్త సూచించారు. రబీ సీజన్‌లో సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయమని తెలిపారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఆలస్యంగా విత్తడం వల్ల మగ పూత అధికంగా వచ్చి దిగుబడి 25 నుంచి 40 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎరువుల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల్లోపు తగిన మోతాదులో పెండిమెథాలిన్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఎరువుల విషయానికి వస్తే.. ఆఖరి దుక్కిలో ఎకరాకు 32 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల పొటాష్ వేయాలని వివరించారు. విత్తిన 30 నుంచి 40 రోజుల తర్వాత మరోసారి 32 కిలోల యూరియా వేయాలని తెలిపారు. పంటను ఆశించే పురుగులు, తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పలమనేరు సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్‌లో పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు రైతులకు 120 కిలోల ఆముదం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు.

అంతేకాకుండా త్వరలో అమల్లోకి రానున్న ఎరువుల విక్రయాల నూతన FFS విధానంపై కూడా అవగాహన కల్పించారు. ఈ విధానంలో రైతులు QR కోడ్ ద్వారా ఎరువులకు ముందస్తు ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 8:04 am Digital Edition : Prabhanews
తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం.. ఈ పంట వేస్తే రైతుల జేబులు నిండటం ఖాయమంటున్న శాస్త్రవేత్తలు! |

Last Updated:Nov 21, 2026 8:03 AM ISTచిత్తూరు జిల్లాలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా ఆముదం సాగు చేపట్టాలని వ్యవసాయ నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు.
News18రైతులు ప్రతి ఏడాది ఒకే రకమైన పంట సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వేరుశనగ సాగుకు ప్రత్యామ్నాయంగా ఆముదం పంటను సాగు చేయడం ప్రయోజనకరమని జిల్లా ఏరువాక కేంద్రం చిత్తూరు ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎ. బాలహుస్సేయిన్ రెడ్డి తెలిపారు. లోకల్18 ద్వారా రైతులకు ఈ పంట సాగు విధానాలు, యాజమాన్య పద్ధతులపై వివరించారు.బైరెడ్డిపల్లి మండలం కడపనతం గ్రామంలో జాతీయ నూనెగింజల మిషన్‌లో భాగంగా ఆముదం సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బాలహుస్సేయిన్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో అడవి పందుల బెడద కారణంగా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటగా ఆముదం సాగును ఎంచుకోవచ్చని సూచించారు. ఆముదం పంటకు అడవి పందుల సమస్య తక్కువగా ఉంటుందని, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చని వివరించారు.విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలి?ఆముదం సాగుకు ఎకరాకు సుమారు రెండు కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేసిన తర్వాతే పొలంలో నాటుకోవాలని శాస్త్రవేత్త సూచించారు. రబీ సీజన్‌లో సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయమని తెలిపారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఆలస్యంగా విత్తడం వల్ల మగ పూత అధికంగా వచ్చి దిగుబడి 25 నుంచి 40 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎరువుల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుకలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల్లోపు తగిన మోతాదులో పెండిమెథాలిన్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఎరువుల విషయానికి వస్తే.. ఆఖరి దుక్కిలో ఎకరాకు 32 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల పొటాష్ వేయాలని వివరించారు. విత్తిన 30 నుంచి 40 రోజుల తర్వాత మరోసారి 32 కిలోల యూరియా వేయాలని తెలిపారు. పంటను ఆశించే పురుగులు, తెగుళ్లను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన పలమనేరు సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. ఈ రబీ సీజన్‌లో పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు రైతులకు 120 కిలోల ఆముదం విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు.అంతేకాకుండా త్వరలో అమల్లోకి రానున్న ఎరువుల విక్రయాల నూతన FFS విధానంపై కూడా అవగాహన కల్పించారు. ఈ విధానంలో రైతులు QR కోడ్ ద్వారా ఎరువులకు ముందస్తు ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.మరింత చదవండి

Source link