ప్రభన్యూస్

Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఎండలు, ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకువచ్చింది. వర్షాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది.

+

Weather

Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు!

వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు అయిన ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, జూలై 15 ఉదయం 08.30 గంటలకు వాయువ్య బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధ  ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు  వెళ్ళే  కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. రాబోయే 2 రోజులలో ఇది బలమైన అల్పపీడన ప్రాంతంగా మారి, ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ పి లక్ష్మి నరసింహ మూర్తి తెలిపారు.

సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జమ్మూ, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, బస్తీ, పాట్నా, బంకురా, వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా,  ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం పై విస్తరించి ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ , యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో 3 రోజుల వరకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం.

జూలై 17వ తేదీన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు  గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి ,తేమ , అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

జూలై 17వ తేదీన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి  లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 10:58 am Digital Edition : Prabhanews
Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 16, 2026 10:54 AM ISTఎండలు, ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకువచ్చింది. వర్షాలపై కీలక అప్‌డేట్ ఇచ్చింది.+
Weather Update: ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు!వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలు అయిన ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, జూలై 15 ఉదయం 08.30 గంటలకు వాయువ్య బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలపై కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధ  ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు  వెళ్ళే  కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. రాబోయే 2 రోజులలో ఇది బలమైన అల్పపీడన ప్రాంతంగా మారి, ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది అని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ పి లక్ష్మి నరసింహ మూర్తి తెలిపారు.సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జమ్మూ, డెహ్రాడూన్, షాజహాన్‌పూర్, బస్తీ, పాట్నా, బంకురా, వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా,  ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం పై విస్తరించి ఉన్నది. ఆంధ్ర ప్రదేశ్ , యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో 3 రోజుల వరకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం.జూలై 17వ తేదీన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు  గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి ,తేమ , అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.జూలై 17వ తేదీన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి  లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి  లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది అన్నారు.Location :Visakhapatnam,Visakhapatnam,Andhra PradeshFirst Published :Jul 16, 2026 10:54 AM ISTమరింత చదవండి

Source link