ఎండీఆర్ వల్ల బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక సదుపాయాలు, కొత్త ఆవిష్కరణలు, భద్రత కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టగలవని తెలిపారు. ఈ పెట్టుబడుల వల్ల యూపీఐ వినియోగదారులందరికీ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పార్లమెంట్‌లో ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్ ఆమోదం పొందిన తర్వాతే ఎండీఆర్‌పై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. జూలై 20 నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని సీతారామన్ ప్రస్తావించారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఉంటే సభలో దీనిపై చర్చ జరిగి ఉండేదని ఆమె అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
