Tirupati Trains: తిరుమల భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు.. 2 స్పెషల్ ట్రైన్స్, మరో 18 ట్రిప్పులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి తిరుపతికి వారానికి రెండుసార్లు నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

News18
News18

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, విశాఖపట్నం వైపు ప్రయాణించే రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు తిరుపతి, విశాఖపట్నం మధ్య వారానికి రెండుసార్లు నడిచే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను మరికొంత కాలం కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల రాకపోకల పూర్తి వివరాలను సౌత్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో బాలాజీ కిరణ్ అధికారికంగా ప్రకటించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సేవలను పొడిగించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

రైలు నంబర్ 08509 తిరుపతి – విశాఖపట్నం వారానికి రెండుసార్లు నడిచే ప్రత్యేక రైలు 29.11.2026 నుంచి 28.01.2027 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం, గురువారం ఉదయం 09:50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే సోమవారం, శుక్రవారం ఉదయం 06:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ పొడిగింపు వ్యవధిలో ఈ ప్రత్యేక రైలు మొత్తం 18 ట్రిప్పులు నడుస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Ayyappa Devotees: అక్కడికక్కడే రూ.5,000 ఫైన్.. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్!

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08510 విశాఖపట్నం – తిరుపతి బై-వీక్లీ ప్రత్యేక రైలు 30.11.2026 నుంచి 29.01.2027 వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ రైలు ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 19:40 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం తిరుపతికి చేరుకుంటుంది. నిర్దేశిత తేదీల ప్రకారం ఈ రెండు రైళ్లు క్రమం తప్పకుండా రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ తెలియజేసింది.

ఇది కూడా చదవండి: Railways: రైలులో 150 కిలోమీటర్లు ఉచితంగా ప్రయాణించొచ్చని మీకు తెలుసా? ఈ రూల్ ఎవరికి వర్తిస్తుందంటే..

ఈ ప్రత్యేక రైళ్లకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గూటి, గుంతకల్, ధోనే (డోన్), బేతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపూర్ రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను కలుపుతూ సాగే ఈ రైళ్లతో ఆయా ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది.

ఇక కోచ్‌ల నిర్మాణం విషయానికి వస్తే ఈ రెండు ప్రత్యేక రైళ్లలో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, ఒక సెకండ్ ఏసీ కోచ్, నాలుగు థర్డ్ ఏసీ కోచ్‌లు, పది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/దివ్యాంగజన్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైలు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 November 2026, 10:56 am Digital Edition : Prabhanews
Tirupati Trains: తిరుమల భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు.. 2 స్పెషల్ ట్రైన్స్, మరో 18 ట్రిప్పులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Nov 24, 2026 9:21 AM ISTప్రయాణికుల రద్దీని తగ్గించడానికి తిరుపతికి వారానికి రెండుసార్లు నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.News18తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, విశాఖపట్నం వైపు ప్రయాణించే రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు తిరుపతి, విశాఖపట్నం మధ్య వారానికి రెండుసార్లు నడిచే ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను మరికొంత కాలం కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల రాకపోకల పూర్తి వివరాలను సౌత్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో బాలాజీ కిరణ్ అధికారికంగా ప్రకటించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సేవలను పొడిగించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.రైలు నంబర్ 08509 తిరుపతి - విశాఖపట్నం వారానికి రెండుసార్లు నడిచే ప్రత్యేక రైలు 29.11.2026 నుంచి 28.01.2027 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం, గురువారం ఉదయం 09:50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే సోమవారం, శుక్రవారం ఉదయం 06:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ పొడిగింపు వ్యవధిలో ఈ ప్రత్యేక రైలు మొత్తం 18 ట్రిప్పులు నడుస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: Ayyappa Devotees: అక్కడికక్కడే రూ.5,000 ఫైన్.. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్!తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08510 విశాఖపట్నం - తిరుపతి బై-వీక్లీ ప్రత్యేక రైలు 30.11.2026 నుంచి 29.01.2027 వరకు ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ రైలు ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 19:40 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం తిరుపతికి చేరుకుంటుంది. నిర్దేశిత తేదీల ప్రకారం ఈ రెండు రైళ్లు క్రమం తప్పకుండా రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ తెలియజేసింది.ఇది కూడా చదవండి: Railways: రైలులో 150 కిలోమీటర్లు ఉచితంగా ప్రయాణించొచ్చని మీకు తెలుసా? ఈ రూల్ ఎవరికి వర్తిస్తుందంటే..ఈ ప్రత్యేక రైళ్లకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గూటి, గుంతకల్, ధోనే (డోన్), బేతంచెర్ల, నంద్యాల, దిగువమెట్ట, మార్కాపూర్ రోడ్, దొనకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను కలుపుతూ సాగే ఈ రైళ్లతో ఆయా ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది.ఇక కోచ్‌ల నిర్మాణం విషయానికి వస్తే ఈ రెండు ప్రత్యేక రైళ్లలో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, ఒక సెకండ్ ఏసీ కోచ్, నాలుగు థర్డ్ ఏసీ కోచ్‌లు, పది స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజీ/దివ్యాంగజన్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైలు సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.మరింత చదవండి

Source link