ప్రభన్యూస్

Telangana Rains: వరుణదేవుడా కరుణించవా.. బతుకమ్మ పాటలతో వర్షాల కోసం మహిళల ప్రత్యేక ప్రార్థనలు..! |


Last Updated:

వర్షాభావంతో ఆందోళనలో ఉన్న రైతుల కోసం రాజన్న సిరిసిల్లలో మహిళలు బతుకమ్మతో వరుణ ప్రార్థనలు, కప్పతల్లి, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

+

News18

News18

వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతుండగా, సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కప్పతల్లి , హోమాలు, అభిషేకాలు జరుగుతుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలు చేసిన వినూత్న ప్రార్థనలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో ఉపాధి హామీ మహిళా కూలీలు వర్షాల కోసం ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చి, వరుణదేవుడిని వేడుకుంటూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడారు. వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామంలోని మహిళలందరూ ఒకచోట చేరి నీటి బిందెలకు వేప కొమ్మలు చుట్టి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతూ, “వరుణదేవా కరుణించవా” అంటూ సంప్రదాయ గీతాలు ఆలపించారు. ఈ విధంగా భక్తితో ప్రార్థిస్తే వరుణదేవుడు ప్రసన్నమై వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసం గ్రామస్తుల్లో కనిపించింది.

ఈ కార్యక్రమంలో మర్రిగడ్డ గ్రామ సర్పంచ్ దూది మనీషాతో పాటు ఉపాధి హామీ మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ వర్షాలు కురవాలని, రైతుల కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమానికి నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాల కోసం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. వేములవాడలో మహాశివుడికి అభిషేకాలు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గాయత్రి మాత ఆలయంలో హోమాలు, ఎల్లారెడ్డిపేట ప్రాంతంలో కప్పతల్లి ఆటలు నిర్వహిస్తూ వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. రైతుల కష్టాలు తీరాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలు తమ సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ చేస్తున్న ఈ విశిష్ట ప్రార్థనలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:38 am Digital Edition : Prabhanews
Telangana Rains: వరుణదేవుడా కరుణించవా.. బతుకమ్మ పాటలతో వర్షాల కోసం మహిళల ప్రత్యేక ప్రార్థనలు..! |

Last Updated:Jun 28, 2026 10:39 PM ISTవర్షాభావంతో ఆందోళనలో ఉన్న రైతుల కోసం రాజన్న సిరిసిల్లలో మహిళలు బతుకమ్మతో వరుణ ప్రార్థనలు, కప్పతల్లి, హోమాలు, అభిషేకాలు నిర్వహించగా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్+
News18వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతుండగా, సకాలంలో వర్షాలు కురవాలని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కప్పతల్లి , హోమాలు, అభిషేకాలు జరుగుతుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలు చేసిన వినూత్న ప్రార్థనలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో ఉపాధి హామీ మహిళా కూలీలు వర్షాల కోసం ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చి, వరుణదేవుడిని వేడుకుంటూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడారు. వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామంలోని మహిళలందరూ ఒకచోట చేరి నీటి బిందెలకు వేప కొమ్మలు చుట్టి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆటలు ఆడుతూ, "వరుణదేవా కరుణించవా" అంటూ సంప్రదాయ గీతాలు ఆలపించారు. ఈ విధంగా భక్తితో ప్రార్థిస్తే వరుణదేవుడు ప్రసన్నమై వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసం గ్రామస్తుల్లో కనిపించింది.ఈ కార్యక్రమంలో మర్రిగడ్డ గ్రామ సర్పంచ్ దూది మనీషాతో పాటు ఉపాధి హామీ మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ వర్షాలు కురవాలని, రైతుల కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమానికి నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాల కోసం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. వేములవాడలో మహాశివుడికి అభిషేకాలు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గాయత్రి మాత ఆలయంలో హోమాలు, ఎల్లారెడ్డిపేట ప్రాంతంలో కప్పతల్లి ఆటలు నిర్వహిస్తూ వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. రైతుల కష్టాలు తీరాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలు తమ సాంప్రదాయాలను నిలబెట్టుకుంటూ చేస్తున్న ఈ విశిష్ట ప్రార్థనలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.Location :Karimnagar,TelanganaFirst Published :Jun 28, 2026 10:39 PM ISTమరింత చదవండి

Source link