ప్రభన్యూస్

Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. ఆరామ్‌కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది మృతి! |


Last Updated:

Helicopter Crash: సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ ఆరామ్‌కో (Saudi Aramco) సంస్థకు చెందిన హెలికాప్టర్ రాస్ తనూరా (Ras Tanura) ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ప్రయాణిస్తున్న 14 మంది దుర్మరణం పాలయ్యారు.

ఆరామ్కోరిఫైనరీ
ఆరామ్కోరిఫైనరీ

ఈ విషయాన్ని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. “సౌదీ ఆరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు మరణించారు” అని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ అధికారికంగా ‘X’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని, మృతుల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని తెలిపారు.

మృతులంతా సౌదీ పౌరులే

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన 14 మంది కూడా సౌదీ అరేబియా జాతీయులేనని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘోర ప్రమాదంపై సంబంధిత అధికారులతో కూడిన ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, బాధితుల కుటుంబాలకు తమ తీవ్ర సెంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.

అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ కథనం ప్రకారం.. సౌదీ అరేబియా తూర్పు తీరంలో, హార్ముజ్ జలసంధికి పశ్చిమ భాగంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ప్రమాదం జరిగిన రాస్ తనూరా ప్రాంతంలోనే మధ్యప్రాచ్యంలో కెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం (ఆయిల్ రిఫైనరీ) ఉంది. దీనిని సౌదీ ఆరామ్‌కో సంస్థే నిర్వహిస్తోంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత, శుక్రవారం నుంచే ఆరామ్‌కో సంస్థ రాస్ తనూరా టెర్మినల్ నుండి ముడి చమురు లోడింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభించింది. ఈ లోపే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

ఫ్రాన్స్‌లోనూ విమాన ప్రమాదం

ఇదిలావుండగా, అంతకుముందు రోజు ఫ్రాన్స్‌లో కూడా ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. తూర్పు ఫ్రాన్స్ పరిధిలోని ‘టాంబ్లైన్’ పట్టణంలో ఒక చిన్న పౌర విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్‌తో సహా 11 మంది మరణించారు. ఈ విమానంలో పైలట్‌తో కలిపి మొత్తం 11 మంది ఉన్నారని మీర్తే-ఎట్-మోసెల్ విభాగపు ప్రిఫెక్ట్ వైవ్స్ సెగ్యు ధృవీకరించారు. ఒకే రోజు ఇటు సౌదీ అరేబియాలో, అటు ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వైమానిక ప్రమాదాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:37 am Digital Edition : Prabhanews
Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. ఆరామ్‌కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది మృతి! |

Last Updated:Jun 28, 2026 6:26 PM ISTHelicopter Crash: సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ ఆరామ్‌కో (Saudi Aramco) సంస్థకు చెందిన హెలికాప్టర్ రాస్ తనూరా (Ras Tanura) ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ప్రయాణిస్తున్న 14 మంది దుర్మరణం పాలయ్యారు.ఆరామ్కోరిఫైనరీఈ విషయాన్ని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. "సౌదీ ఆరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు మరణించారు" అని సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ అధికారికంగా 'X' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని, మృతుల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని తెలిపారు.మృతులంతా సౌదీ పౌరులేస్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన 14 మంది కూడా సౌదీ అరేబియా జాతీయులేనని ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘోర ప్రమాదంపై సంబంధిత అధికారులతో కూడిన ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, బాధితుల కుటుంబాలకు తమ తీవ్ర సెంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది.అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' కథనం ప్రకారం.. సౌదీ అరేబియా తూర్పు తీరంలో, హార్ముజ్ జలసంధికి పశ్చిమ భాగంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ప్రమాదం జరిగిన రాస్ తనూరా ప్రాంతంలోనే మధ్యప్రాచ్యంలో కెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం (ఆయిల్ రిఫైనరీ) ఉంది. దీనిని సౌదీ ఆరామ్‌కో సంస్థే నిర్వహిస్తోంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత, శుక్రవారం నుంచే ఆరామ్‌కో సంస్థ రాస్ తనూరా టెర్మినల్ నుండి ముడి చమురు లోడింగ్ కార్యకలాపాలను పునఃప్రారంభించింది. ఈ లోపే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.ఫ్రాన్స్‌లోనూ విమాన ప్రమాదంఇదిలావుండగా, అంతకుముందు రోజు ఫ్రాన్స్‌లో కూడా ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. తూర్పు ఫ్రాన్స్ పరిధిలోని 'టాంబ్లైన్' పట్టణంలో ఒక చిన్న పౌర విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్‌తో సహా 11 మంది మరణించారు. ఈ విమానంలో పైలట్‌తో కలిపి మొత్తం 11 మంది ఉన్నారని మీర్తే-ఎట్-మోసెల్ విభాగపు ప్రిఫెక్ట్ వైవ్స్ సెగ్యు ధృవీకరించారు. ఒకే రోజు ఇటు సౌదీ అరేబియాలో, అటు ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వైమానిక ప్రమాదాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link