నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
వందకు పైగా ద్విచక్ర వాహనాల తనిఖీ
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసుల హెచ్చరిక
ప్రభ న్యూస్ – కామారెడ్డి జిల్లా, ఆగస్టు 7
కామారెడ్డి జిల్లా పోలీసు అధికారి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక తనిఖీ (స్పెషల్ డ్రైవ్) నిర్వహించారు.
పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని వందకు పైగా ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి, తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రతి వాహనానికి చట్టబద్ధమైన నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, సరైన నెంబర్ ప్లేట్‌తోనే వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు కామారెడ్డి ట్రాఫిక్ సిబ్బంది పూర్తిస్థాయిలో పాల్గొన్నారు.


