ప్రభన్యూస్

Sigma Trailer: ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ కొడుకు తొలి సినిమాపై ఒక్కసారిగా హైప్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రాబోతున్న తొలి సినిమా సిగ్మా’. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.

News18
News18

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సిగ్మా’ (Sigma). కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటంతో ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఆద్యంతం స్టైలిష్ మేకింగ్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది. క్యాసినో, డ్రగ్స్, వేల కోట్ల హవాలా లాంటి డార్క్ అండర్‌వరల్డ్ నేపథ్యంతో ఈ కథను దర్శకుడు జేసన్ సంజయ్ ఎంతో గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ విజువల్స్ చూస్తే స్పష్టమవుతోంది.

‘‘ఈ జూదము, మత్తు.. కాయిన్‌కి రెండు వైపుల్లాంటివి.. ఈ రెండూ అలవాటు చేస్తే కోట్లు సంపాదించవచ్చు..’’.. ‘ఎంత? ఐదు వందల కోట్లు!’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే వాయిస్ ఓవర్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేసింది. ఇందులో ‘కోట్లపాడి వీరయ్య రెడ్డి’ అనే క్రూరమైన అండర్‌వరల్డ్ డాన్ పాత్రలో ఓ సీనియర్ నటుడు పవర్‌ఫుల్ విలనిజాన్ని పండించారు. ‘‘ఆయన ఆకలి కోసం వేటాడటం మొదలుపెట్టాడు.. మొత్తం అడవంతా ఆయన కంట్రోల్‌లోనే ఉంది’’ అనే ఎలివేషన్ డైలాగ్ విలన్ క్యారెక్టరైజేషన్ తీవ్రతను పరిచయం చేసింది.

ఈ చిత్రంలో హీరో సందీప్ కిషన్ రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఒక క్యాజువల్ కుర్రాడిగా ఉంటూనే, రేడియో జాకీ ‘సామ్’గా నటిస్తున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో ప్రేమాయణం నడిపే సరదా యువకుడిగా కనిపించారు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లోకి మారిపోయి ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో సందీప్ చెప్పిన, ‘‘ఓడిపోవడం నాకు కొత్త కాదు.. కానీ ఆడేబ్బా.. మోసం చేసే వాళ్లను వదిలేదే లేదు’’ అనే మాస్ డైలాగ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.

తండ్రి దళపతి విజయ్ లాగా హీరోగా కాకుండా, దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన జేసన్ సంజయ్ తన తొలి ప్రయత్నంలోనే విజువల్స్, టేకింగ్ పరంగా తన మార్క్ చూపించారని జనం చెప్పుకుంటున్నారు. టెక్నికల్ గా లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌గా కనిపిస్తున్నాయి. పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస ప్రయోగాలు చేస్తున్న సందీప్ కిషన్‌కు, అక్టోబర్ 2 హాలిడే సీజన్‌లో వస్తున్న ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 11:24 am Digital Edition : Prabhanews
Sigma Trailer: ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ కొడుకు తొలి సినిమాపై ఒక్కసారిగా హైప్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 19, 2026 10:54 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రాబోతున్న తొలి సినిమా సిగ్మా’. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. News18యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సిగ్మా’ (Sigma). కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటంతో ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఆద్యంతం స్టైలిష్ మేకింగ్, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది. క్యాసినో, డ్రగ్స్, వేల కోట్ల హవాలా లాంటి డార్క్ అండర్‌వరల్డ్ నేపథ్యంతో ఈ కథను దర్శకుడు జేసన్ సంజయ్ ఎంతో గ్రిప్పింగ్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ విజువల్స్ చూస్తే స్పష్టమవుతోంది.‘‘ఈ జూదము, మత్తు.. కాయిన్‌కి రెండు వైపుల్లాంటివి.. ఈ రెండూ అలవాటు చేస్తే కోట్లు సంపాదించవచ్చు..’’.. ‘ఎంత? ఐదు వందల కోట్లు!’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే వాయిస్ ఓవర్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేసింది. ఇందులో ‘కోట్లపాడి వీరయ్య రెడ్డి’ అనే క్రూరమైన అండర్‌వరల్డ్ డాన్ పాత్రలో ఓ సీనియర్ నటుడు పవర్‌ఫుల్ విలనిజాన్ని పండించారు. ‘‘ఆయన ఆకలి కోసం వేటాడటం మొదలుపెట్టాడు.. మొత్తం అడవంతా ఆయన కంట్రోల్‌లోనే ఉంది’’ అనే ఎలివేషన్ డైలాగ్ విలన్ క్యారెక్టరైజేషన్ తీవ్రతను పరిచయం చేసింది.ఈ చిత్రంలో హీరో సందీప్ కిషన్ రెండు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఒక క్యాజువల్ కుర్రాడిగా ఉంటూనే, రేడియో జాకీ 'సామ్'గా నటిస్తున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో ప్రేమాయణం నడిపే సరదా యువకుడిగా కనిపించారు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లోకి మారిపోయి ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో సందీప్ చెప్పిన, ‘‘ఓడిపోవడం నాకు కొత్త కాదు.. కానీ ఆడేబ్బా.. మోసం చేసే వాళ్లను వదిలేదే లేదు’’ అనే మాస్ డైలాగ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది.తండ్రి దళపతి విజయ్ లాగా హీరోగా కాకుండా, దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన జేసన్ సంజయ్ తన తొలి ప్రయత్నంలోనే విజువల్స్, టేకింగ్ పరంగా తన మార్క్ చూపించారని జనం చెప్పుకుంటున్నారు. టెక్నికల్ గా లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌గా కనిపిస్తున్నాయి. పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస ప్రయోగాలు చేస్తున్న సందీప్ కిషన్‌కు, అక్టోబర్ 2 హాలిడే సీజన్‌లో వస్తున్న ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ బ్రేక్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరింత చదవండి

Source link