గరిష్ఠ ధర నుంచి ఎంత తగ్గింది?
మే 29, 2026న 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.62 లక్షలుగా ఉంది. అయితే అక్టోబర్ 31 నాటికి ధర 12.8 శాతం, అంటే దాదాపు రూ.20,900 తగ్గి రూ.1.42 లక్షలకు చేరింది. PTI వెల్లడించిన పరిశ్రమ గణాంకాల ప్రకారం.. నవంబర్ 5న 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,45,870 వద్ద ట్రేడయింది. ఈ తగ్గుదలతో గతంలో అధిక ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసిన కొంతమంది వినియోగదారులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. పండుగ సీజన్‌కు ముందు ధరలు తగ్గడం నగల వ్యాపారులకు కూడా ఊరటనిస్తోంది. ఈసారి ఆభరణాల అమ్మకాలు పరిమాణం పరంగా స్థిరంగా ఉండొచ్చని, అయితే మొత్తం అమ్మకాల విలువ 20 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) అంచనా వేస్తోంది. ధరల తగ్గుదల వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని GJC ఛైర్మన్ రాజేష్ రోక్డే PTIకి తెలిపారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధరలు తగ్గడంతో ఆభరణాల కొనుగోళ్లకు ఆసక్తి పెరిగిందని, రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో వివాహాలు చేసుకోబోయే కుటుంబాలు తమ కొనుగోళ్లను ముందుగానే పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు.

