ప్రభన్యూస్

RRB Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా రైల్వే ఉద్యోగాలు.. |


Last Updated:

ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ పోస్టుల దరఖాస్తు గడువు నవంబర్ 15, 2026 వరకు పొడిగించబడింది. ఇంటర్మీడియట్ అర్హతతో 1,688 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరబడుతున్నాయి.

News18
News18

రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సాంకేతిక సమస్యలు, వెబ్‌సైట్‌లో సర్వర్ ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు దరఖాస్తు చేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించింది. గతంలో నవంబర్ 13గా నిర్ణయించిన చివరి తేదీని నవంబర్ 15, 2026 వరకు పెంచింది. ఆ రోజు రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మొత్తం 1,688 ఖాళీలు.. ఏయే పోస్టులంటే?

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ యూజీ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1,688 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు తమ అర్హత, ఆసక్తిని బట్టి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ విభాగంలో 700 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో 600 ఖాళీలు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 200 ఉండగా, ట్రైన్ క్లర్క్ విభాగంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు రుసుము ఎంతంటే?

అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా దరఖాస్తు రుసుమును నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.250 ఫీజుగా నిర్ణయించారు. అయితే మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన వారికి నిబంధనల ప్రకారం రుసుములో కొంత మొత్తం తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల ఫీజు రిఫండ్ నిబంధనలను పరిశీలించి పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి.

నవంబర్ 16 నుంచి దరఖాస్తుల సవరణ

ఆన్‌లైన్ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. నవంబర్ 16 నుంచి 25, 2026 వరకు సవరణల గడువు అందుబాటులో ఉంటుంది. నిర్ణీత రుసుము చెల్లించి ఈ సమయంలో వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తి ఉన్నవారు ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సందర్శించాలి. అక్కడ ‘RRB NTPC Undergraduate Recruitment 2026’ లింక్‌ను ఎంచుకోవాలి. కొత్త అభ్యర్థులు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇప్పటికే ఖాతా ఉన్నవారు లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అనంతరం వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసి, కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియలో లైవ్ ఫొటో క్యాప్చర్, ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. చివరగా దరఖాస్తును సమర్పించి ప్రింట్ తీసుకోవాలి.

ముఖ్యంగా అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల్లో ఒక్క జోన్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ జోన్లకు దరఖాస్తు చేస్తే అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 1:21 pm Digital Edition : Prabhanews
RRB Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా రైల్వే ఉద్యోగాలు.. |

Last Updated:Nov 15, 2026 1:14 PM ISTఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ పోస్టుల దరఖాస్తు గడువు నవంబర్ 15, 2026 వరకు పొడిగించబడింది. ఇంటర్మీడియట్ అర్హతతో 1,688 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరబడుతున్నాయి.News18రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సాంకేతిక సమస్యలు, వెబ్‌సైట్‌లో సర్వర్ ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు దరఖాస్తు చేయలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించింది. గతంలో నవంబర్ 13గా నిర్ణయించిన చివరి తేదీని నవంబర్ 15, 2026 వరకు పెంచింది. ఆ రోజు రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.మొత్తం 1,688 ఖాళీలు.. ఏయే పోస్టులంటే?ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ యూజీ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 1,688 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు తమ అర్హత, ఆసక్తిని బట్టి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ విభాగంలో 700 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో 600 ఖాళీలు ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 200 ఉండగా, ట్రైన్ క్లర్క్ విభాగంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు.దరఖాస్తు రుసుము ఎంతంటే?అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా దరఖాస్తు రుసుమును నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.250 ఫీజుగా నిర్ణయించారు. అయితే మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన వారికి నిబంధనల ప్రకారం రుసుములో కొంత మొత్తం తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల ఫీజు రిఫండ్ నిబంధనలను పరిశీలించి పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి.నవంబర్ 16 నుంచి దరఖాస్తుల సవరణఆన్‌లైన్ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిచేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. నవంబర్ 16 నుంచి 25, 2026 వరకు సవరణల గడువు అందుబాటులో ఉంటుంది. నిర్ణీత రుసుము చెల్లించి ఈ సమయంలో వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు.ఎలా దరఖాస్తు చేయాలి?ఆసక్తి ఉన్నవారు ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inను సందర్శించాలి. అక్కడ ‘RRB NTPC Undergraduate Recruitment 2026’ లింక్‌ను ఎంచుకోవాలి. కొత్త అభ్యర్థులు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇప్పటికే ఖాతా ఉన్నవారు లాగిన్ వివరాలతో ప్రవేశించాలి. అనంతరం వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసి, కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించాలి. ఈ ప్రక్రియలో లైవ్ ఫొటో క్యాప్చర్, ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి. చివరగా దరఖాస్తును సమర్పించి ప్రింట్ తీసుకోవాలి.ముఖ్యంగా అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల్లో ఒక్క జోన్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ జోన్లకు దరఖాస్తు చేస్తే అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link