ప్రభన్యూస్

Ramya Krishna: భర్తతో కలిసి ఉండకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ..! | తెలుగు సినిమా వార్తలు


నిజానికి 80, 90 దశకాల్లో రమ్యకృష్ణ ఒక సంచలనం. ఆమె పేరు వినిపిస్తే చాలు.. అప్పటి యూత్ ఊగిపోయేవాళ్లు. ఒక స్టార్ హీరో రేంజ్‌లో రమ్యకృష్ణకు థియేటర్‌లలో ఈలలు పడేవి. అసలు.. అప్పటి యూత్ అందరూ రమ్యకృష్ణ నామమే జపం చేశారు. మెగాస్టార్, బాలయ్య, వెంకీమామ, నాగ్ మామ ఇలా అప్పటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసి హిట్ల మీద హిట్లు కొడుతూ అనతికాలంలోనే అగ్ర కథానాయికగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇక రమ్యకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక బాబు ఉన్నాడు. కాగా.. తాజాగా దర్శకుడు కృష్ణవంశీతో తన వైవాహిక జీవితం గురించి.. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండటానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఇష్టం ఉండదని, కేవలం పని విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. తన భరతనాట్యం ఫొటోలు చూసిన దర్శకులు భారతీరాజా, టి.రాజేందర్ ఇద్దరూ తనను సంప్రదించారని తెలిపారు. అయితే ఒకరి సినిమాలో నటిస్తే మరొకరి సినిమా వదులుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో అప్పట్లో ఇద్దరి సినిమాలూ చేయలేదన్నారు. చివరకు ఓ కమెడియన్‌తో కలిసి తమిళ సినిమాలో నటించానని, అదే తన మొదటి సినిమా అని చెప్పారు. నిజానికి ఓ హీరోయిన్ తన కెరీర్‌ను ఎలా ప్రారంభించకూడదో.. అలా తన సినీ ప్రయాణం మొదలైందని నవ్వుతూ వెల్లడించారు.

తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన ‘అమ్మోరు’ సినిమా గురించి కూడా రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘అల్లుడా మజాకా’, ‘అల్లరి ప్రియుడు’ వంటి సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ‘అమ్మోరు’ చేశానని తెలిపారు. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదన్నారు. అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్త కావడంతో ప్రత్యేకంగా లండన్ నుంచి బ్లూ కలర్ మేకప్ తెప్పించారని గుర్తు చేసుకున్నారు.

ముఖ్యంగా పది చేతులతో కనిపించే సన్నివేశాల కోసం ఉదయం నుంచి తనను కర్రకు కట్టేసి ఉంచేవారని చెప్పారు. నిజమైన ఆయుధాలను పట్టుకుని గంటల తరబడి కదలకుండా ఉండాల్సి వచ్చేదని, కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా వీలుండేది కాదని వివరించారు. అప్పట్లో నటీనటులు ఎంతో కష్టపడేవారని, ఇప్పుడు ఉన్న సౌకర్యాలతో పోలిస్తే తమ సమయంలో కనీసం కారవ్యాన్స్ కూడా ఉండేవి కావని తెలిపారు.

ఇక తన భర్త, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న విషయంపై కూడా రమ్యకృష్ణ స్పందించారు. తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని, అయితే కెరీర్ పరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, ఇద్దరూ సంతోషంగానే ఉన్నామని స్పష్టం చేశారు.

కొడుకు పుట్టిన సమయంలో తాను సీరియల్స్‌తో బిజీగా ఉండేదాన్నని, ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించేదాన్నని తెలిపారు. అయితే తాను అలా వచ్చి వెళ్లిన ప్రతిసారీ కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడని చెప్పారు. దీంతో అతడిని చెన్నైలోనే చదివించాలని కృష్ణవంశీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇద్దరికీ అదే సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ణయించుకున్నామని తెలిపారు.

కృష్ణవంశీ చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారని, ఆయన తన పని విషయంలో జోక్యం చేసుకోరని, తాను కూడా ఆయన సినిమాల విషయంలో జోక్యం చేసుకోనని చెప్పారు. రోజూ గొడవలు పడటం కంటే మంచి స్నేహితుల్లా ఉండటమే తమకు ఇష్టమన్నారు. అంతేకాదు.. అప్పట్లో కృష్ణవంశీ పెళ్లి చేసుకోవడం ఎందుకు, లివింగ్ టుగెదర్‌లో ఉందామని చెప్పారని, అప్పుడు తాను అంగీకరించి ఉంటే బాగుండేదేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇద్దరం మా మా పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నామని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 3:20 pm Digital Edition : Prabhanews
Ramya Krishna: భర్తతో కలిసి ఉండకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన రమ్యకృష్ణ..! | తెలుగు సినిమా వార్తలు

నిజానికి 80, 90 దశకాల్లో రమ్యకృష్ణ ఒక సంచలనం. ఆమె పేరు వినిపిస్తే చాలు.. అప్పటి యూత్ ఊగిపోయేవాళ్లు. ఒక స్టార్ హీరో రేంజ్‌లో రమ్యకృష్ణకు థియేటర్‌లలో ఈలలు పడేవి. అసలు.. అప్పటి యూత్ అందరూ రమ్యకృష్ణ నామమే జపం చేశారు. మెగాస్టార్, బాలయ్య, వెంకీమామ, నాగ్ మామ ఇలా అప్పటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసి హిట్ల మీద హిట్లు కొడుతూ అనతికాలంలోనే అగ్ర కథానాయికగా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది.ఇక రమ్యకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఒక బాబు ఉన్నాడు. కాగా.. తాజాగా దర్శకుడు కృష్ణవంశీతో తన వైవాహిక జీవితం గురించి.. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండటానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ఇష్టం ఉండదని, కేవలం పని విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. తన భరతనాట్యం ఫొటోలు చూసిన దర్శకులు భారతీరాజా, టి.రాజేందర్ ఇద్దరూ తనను సంప్రదించారని తెలిపారు. అయితే ఒకరి సినిమాలో నటిస్తే మరొకరి సినిమా వదులుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో అప్పట్లో ఇద్దరి సినిమాలూ చేయలేదన్నారు. చివరకు ఓ కమెడియన్‌తో కలిసి తమిళ సినిమాలో నటించానని, అదే తన మొదటి సినిమా అని చెప్పారు. నిజానికి ఓ హీరోయిన్ తన కెరీర్‌ను ఎలా ప్రారంభించకూడదో.. అలా తన సినీ ప్రయాణం మొదలైందని నవ్వుతూ వెల్లడించారు.తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన ‘అమ్మోరు’ సినిమా గురించి కూడా రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘అల్లుడా మజాకా’, ‘అల్లరి ప్రియుడు’ వంటి సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ‘అమ్మోరు’ చేశానని తెలిపారు. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని తాను ఊహించలేదన్నారు. అప్పట్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ కొత్త కావడంతో ప్రత్యేకంగా లండన్ నుంచి బ్లూ కలర్ మేకప్ తెప్పించారని గుర్తు చేసుకున్నారు.ముఖ్యంగా పది చేతులతో కనిపించే సన్నివేశాల కోసం ఉదయం నుంచి తనను కర్రకు కట్టేసి ఉంచేవారని చెప్పారు. నిజమైన ఆయుధాలను పట్టుకుని గంటల తరబడి కదలకుండా ఉండాల్సి వచ్చేదని, కనీసం వాష్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా వీలుండేది కాదని వివరించారు. అప్పట్లో నటీనటులు ఎంతో కష్టపడేవారని, ఇప్పుడు ఉన్న సౌకర్యాలతో పోలిస్తే తమ సమయంలో కనీసం కారవ్యాన్స్ కూడా ఉండేవి కావని తెలిపారు.ఇక తన భర్త, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న విషయంపై కూడా రమ్యకృష్ణ స్పందించారు. తామిద్దరం ఇప్పటికీ భార్యాభర్తలమేనని, అయితే కెరీర్ పరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, ఇద్దరూ సంతోషంగానే ఉన్నామని స్పష్టం చేశారు.కొడుకు పుట్టిన సమయంలో తాను సీరియల్స్‌తో బిజీగా ఉండేదాన్నని, ప్రతి 15 రోజులకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించేదాన్నని తెలిపారు. అయితే తాను అలా వచ్చి వెళ్లిన ప్రతిసారీ కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడని చెప్పారు. దీంతో అతడిని చెన్నైలోనే చదివించాలని కృష్ణవంశీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇద్దరికీ అదే సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ణయించుకున్నామని తెలిపారు.కృష్ణవంశీ చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారని, ఆయన తన పని విషయంలో జోక్యం చేసుకోరని, తాను కూడా ఆయన సినిమాల విషయంలో జోక్యం చేసుకోనని చెప్పారు. రోజూ గొడవలు పడటం కంటే మంచి స్నేహితుల్లా ఉండటమే తమకు ఇష్టమన్నారు. అంతేకాదు.. అప్పట్లో కృష్ణవంశీ పెళ్లి చేసుకోవడం ఎందుకు, లివింగ్ టుగెదర్‌లో ఉందామని చెప్పారని, అప్పుడు తాను అంగీకరించి ఉంటే బాగుండేదేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇద్దరం మా మా పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నామని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

Source link