Last Updated:
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు సాధించే విజయానికి ప్రతీక అయిన ఈ పండుగను సైనికులతో కలిసి జరుపుకునే ఆనవాయితీని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్‌లో ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్న ఆయన, ఈ వెలుగుల పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు. చీకటిపై పోరాడే భారత సంకల్పానికి దీపావళి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికుల మధ్య ప్రతి ఏటా దీపావళిని జరుపుకోవడం తనకు ఎంతో ఇష్టమైన ఆనవాయితీ అని, ఈసారి కూడా మన వీర జవాన్లతో కలిసే పండుగ వేడుకల్లో పాల్గొంటానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా నవంబర్ 8వ తేదీ ఆదివారం నాడు ప్రజలు దీపావళి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు.
గత పదకొండేళ్లుగా ప్రధాని మోదీ సరిహద్దుల్లోని సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు. 2014 నుంచి ఆయన సందర్శించిన కీలక రక్షణ ప్రాంతాల జాబితా ఇక్కడ చూద్దాం.
Have a great D.iwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026
2014: సియాచిన్ బేస్ క్యాంప్, లడఖ్ (అక్టోబర్ 23)
2015: పంజాబ్ సరిహద్దు, డోగ్రాయ్ వార్ మెమోరియల్ (నవంబర్ 11)
2016: సుమ్దో, హిమాచల్ ప్రదేశ్ (అక్టోబర్ 30)
2017: గురేజ్ వ్యాలీ, జమ్మూ కశ్మీర్ (అక్టోబర్ 19)
2018: హర్సిల్, ఉత్తరాఖండ్ (నవంబర్ 7)
2019: రాజౌరీ, జమ్మూ కశ్మీర్ (అక్టోబర్ 27)
2020: లోంగేవాలా, రాజస్థాన్ (నవంబర్ 14)
2021: నౌషెరా, జమ్మూ కశ్మీర్ (నవంబర్ 4)
2022: కార్గిల్, లడఖ్ (అక్టోబర్ 24)
2023: లెప్చా, హిమాచల్ ప్రదేశ్ (నవంబర్ 12)
2024: లక్కీ నాలా, సర్ క్రీక్, గుజరాత్ (అక్టోబర్ 31)
2025: ఐఎన్ఎస్ విక్రాంత్, గోవా-కార్వార్ తీరం (అక్టోబర్ 20)

