ప్రభన్యూస్

Kaju Katli: నోరూరించే కాజు కత్లీ.. దీపావళి స్పెషల్‌గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో ఇలా చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

Diwali Special Kaju Katli: దీపావళి పండుగ స్పెషల్ కాజు కత్లీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు ముద్ద అవ్వకుండా, బిళ్లలు గట్టిపడకుండా నోట్లో కరిగిపోయేలా స్వీట్ షాప్ రుచితో రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.

News18
News18

Kaju Katli: పండుగల వేళల్లో, ముఖ్యంగా దీపావళి పర్వదినాన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు పంచడానికి నోరూరించే రాయల్ స్వీట్ చేయాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన సాంప్రదాయ వంటకం ‘కాజు కత్లీ’ అని గృహిణి కల్పన వివరిస్తున్నారు.

జీడిపప్పు కమ్మదనం, నేతి సువాసనలతో నోట్లో వేస్తే కరిగిపోయే ఈ స్వీట్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అమృతంలా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు జీడిపప్పు ముద్ద నూనె కారి జిగురుగా మారిపోవడం లేదా పాకం ముదిరిపోయి బిళ్లలు గట్టిగా రాళ్లలా మారడం జరుగుతుంటుందని తెలుపుతున్నారు. అలా కాకుండా పక్కా కొలతలతో, స్వీట్ షాప్ తరహాలో ఎంతో సాఫ్ట్‌గా డైమండ్ ఆకారంలో పర్ఫెక్ట్‌గా రావడానికి పాటించాల్సిన ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు….

మంచి నాణ్యమైన జీడిపప్పు: 2 కప్పులు (గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నవి) చక్కెర: 1 కప్పు నీళ్లు: అర కప్పు నెయ్యి: 1-2 పెద్ద చెంచాలు యాలకుల పొడి: పావు చిన్న చెంచా (ఐచ్ఛికం) వెండి రేకు (సిల్వర్ వర్క్): అలంకరణ కోసం (ఐచ్ఛికం)

తయారీ విధానం…

జీడిపప్పులో ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. మిక్సీ జార్‌లో జీడిపప్పును వేసి ఒకేసారి కాకుండా, పల్స్ మోడ్‌లో ఆపుతూ ఆపుతూ బరక లేకుండా మెత్తటి పొడిలా చేసుకోవాలి (ఎక్కువ సేపు తిప్పితే జీడిపప్పు నుంచి నూనె వచ్చి ముద్దవుతుంది). ఈ పొడిని జల్లెడ పట్టి, రవ్వలాంటి పెద్ద పలుకులను వేరు చేసి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు ఒక మందపాటి అడుగున్న కడాయి లేదా నాన్‌స్టిక్ బాణలిలో చక్కెర, అర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. చక్కెర పూర్తిగా కరిగి ఒక తీగ పాకం (తీగలా సాగకుండా చేతివేళ్లతో పట్టుకుంటే జిగురుగా ఉంటే చాలు) వచ్చేంతవరకు మీడియం మంటపై మరిగించండి.

పాకం జిగురుగా రాగానే మంటను పూర్తిగా చిన్నది చేసి, జల్లించి పెట్టుకున్న జీడిపప్పు పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపండి. చిన్న మంటపైనే కలుపుతూ ఉడికిస్తే మిశ్రమం దగ్గరపడుతూ బాణలి అంచులను వదిలి ముద్దలా మారుతుంది (సుమారు 7-8 నిమిషాలు పడుతుంది). ఈ దశలో ఒక చెంచా నెయ్యి, యాలకుల పొడి వేసి కలపండి. కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే గుండ్రటి బంతిలా అంటుకోకుండా వస్తే స్టవ్ కట్టేయాలి (ఎక్కువ సేపు ఉంచితే గట్టిపడిపోతుంది).

ఇప్పుడు బటర్‌పేపర్ లేదా నెయ్యి రాసిన పళ్ళెంపై ఈ మిశ్రమాన్ని వేసి కాస్త గోరువెచ్చగా అయ్యేవరకు చల్లారనివ్వండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని మృదువైన పిండి ముద్దలా 2 నిమిషాలు ఒత్తుకోవాలి.

ఆ తర్వాత పైనుంచి మరో బటర్‌పేపర్ ఉంచి చపాతీ కర్రతో సమానమైన మందంతో పల్చగా రుద్దుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన వెండి రేకు అద్ది, చాకుతో అందమైన డైమండ్ ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కాజు కత్లీ సిద్ధం. గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే రెండు నుంచి మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 5:38 pm Digital Edition : Prabhanews
Kaju Katli: నోరూరించే కాజు కత్లీ.. దీపావళి స్పెషల్‌గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్‌లో ఇలా చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 07, 2026 5:37 PM ISTDiwali Special Kaju Katli: దీపావళి పండుగ స్పెషల్ కాజు కత్లీ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు ముద్ద అవ్వకుండా, బిళ్లలు గట్టిపడకుండా నోట్లో కరిగిపోయేలా స్వీట్ షాప్ రుచితో రావాలంటే పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.News18Kaju Katli: పండుగల వేళల్లో, ముఖ్యంగా దీపావళి పర్వదినాన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులకు పంచడానికి నోరూరించే రాయల్ స్వీట్ చేయాలనిపించినప్పుడు గుర్తొచ్చే అద్భుతమైన సాంప్రదాయ వంటకం 'కాజు కత్లీ' అని గృహిణి కల్పన వివరిస్తున్నారు.జీడిపప్పు కమ్మదనం, నేతి సువాసనలతో నోట్లో వేస్తే కరిగిపోయే ఈ స్వీట్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అమృతంలా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో చేసేటప్పుడు జీడిపప్పు ముద్ద నూనె కారి జిగురుగా మారిపోవడం లేదా పాకం ముదిరిపోయి బిళ్లలు గట్టిగా రాళ్లలా మారడం జరుగుతుంటుందని తెలుపుతున్నారు. అలా కాకుండా పక్కా కొలతలతో, స్వీట్ షాప్ తరహాలో ఎంతో సాఫ్ట్‌గా డైమండ్ ఆకారంలో పర్ఫెక్ట్‌గా రావడానికి పాటించాల్సిన ఆ వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.కావలసిన పదార్థాలు....మంచి నాణ్యమైన జీడిపప్పు: 2 కప్పులు (గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నవి) చక్కెర: 1 కప్పు నీళ్లు: అర కప్పు నెయ్యి: 1-2 పెద్ద చెంచాలు యాలకుల పొడి: పావు చిన్న చెంచా (ఐచ్ఛికం) వెండి రేకు (సిల్వర్ వర్క్): అలంకరణ కోసం (ఐచ్ఛికం)తయారీ విధానం...జీడిపప్పులో ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. మిక్సీ జార్‌లో జీడిపప్పును వేసి ఒకేసారి కాకుండా, పల్స్ మోడ్‌లో ఆపుతూ ఆపుతూ బరక లేకుండా మెత్తటి పొడిలా చేసుకోవాలి (ఎక్కువ సేపు తిప్పితే జీడిపప్పు నుంచి నూనె వచ్చి ముద్దవుతుంది). ఈ పొడిని జల్లెడ పట్టి, రవ్వలాంటి పెద్ద పలుకులను వేరు చేసి పక్కన పెట్టుకోండి.ఇప్పుడు ఒక మందపాటి అడుగున్న కడాయి లేదా నాన్‌స్టిక్ బాణలిలో చక్కెర, అర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. చక్కెర పూర్తిగా కరిగి ఒక తీగ పాకం (తీగలా సాగకుండా చేతివేళ్లతో పట్టుకుంటే జిగురుగా ఉంటే చాలు) వచ్చేంతవరకు మీడియం మంటపై మరిగించండి.పాకం జిగురుగా రాగానే మంటను పూర్తిగా చిన్నది చేసి, జల్లించి పెట్టుకున్న జీడిపప్పు పొడిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపండి. చిన్న మంటపైనే కలుపుతూ ఉడికిస్తే మిశ్రమం దగ్గరపడుతూ బాణలి అంచులను వదిలి ముద్దలా మారుతుంది (సుమారు 7-8 నిమిషాలు పడుతుంది). ఈ దశలో ఒక చెంచా నెయ్యి, యాలకుల పొడి వేసి కలపండి. కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చూస్తే గుండ్రటి బంతిలా అంటుకోకుండా వస్తే స్టవ్ కట్టేయాలి (ఎక్కువ సేపు ఉంచితే గట్టిపడిపోతుంది).ఇప్పుడు బటర్‌పేపర్ లేదా నెయ్యి రాసిన పళ్ళెంపై ఈ మిశ్రమాన్ని వేసి కాస్త గోరువెచ్చగా అయ్యేవరకు చల్లారనివ్వండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకుని మృదువైన పిండి ముద్దలా 2 నిమిషాలు ఒత్తుకోవాలి.ఆ తర్వాత పైనుంచి మరో బటర్‌పేపర్ ఉంచి చపాతీ కర్రతో సమానమైన మందంతో పల్చగా రుద్దుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పైన వెండి రేకు అద్ది, చాకుతో అందమైన డైమండ్ ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కాజు కత్లీ సిద్ధం. గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే రెండు నుంచి మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది.మరింత చదవండి

Source link