మటన్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన నాన్‌వెజ్ ఆహారం. వారానికి ఒకసారి లేదా రెండు మూడు సార్లు మటన్ తినే వారు కూడా చాలామంది ఉంటారు. మటన్‌లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం తయారవ్వడానికి, కండరాలు బలపడేందుకు, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. అయితే మటన్‌లోని అన్ని భాగాలు ఒకేలా ఆరోగ్యకరమైనవి కావు. కొన్ని భాగాల్లో కొవ్వు (ఫ్యాట్), కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తరచుగా తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

