ప్రభన్యూస్

Gold Price: బంగారం కొందామంటే బెంబేలెత్తాల్సిందే.. వెండి రేట్లకు రెక్కలు.. నెలలో ఎంత పెరిగాయంటే? |

bullions.co.in వెల్లడించిన హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌ గణాంకాల ప్రకారం.. ఆగస్టు 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,390గా ఉంది. అయితే ఆగస్టు 31 నాటికి అదే పరిమాణం బంగారం ధర రూ.1,54,900కు చేరుకుంది. అంటే కేవలం నెల రోజుల్లోనే 10 గ్రాములపై రూ.11,510 పెరిగింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆగస్టు 31 నాటికి రూ.1,41,990గా నమోదైంది. ఆభరణాల తయారీలో సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించే నేపథ్యంలో ఈ పెరుగుదల కొనుగోలుదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వెండి ధరల్లోనూ ఇదే విధమైన భారీ పెరుగుదల కనిపించింది. bullions.co.in ప్రకారం ఆగస్టు 1న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,18,100గా ఉండగా.. ఆగస్టు 31 నాటికి రూ.2,39,970కు చేరుకుంది. అంటే ఒక్క కిలో వెండిపై నెల రోజుల్లోనే రూ.21,870 పెరిగింది. దీంతో వెండి ఆభరణాలు, వస్తువులు, పెట్టుబడి కోసం కొనుగోలు చేసేవారిపైనా అదనపు భారం పడుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 1:53 pm Digital Edition : Prabhanews